YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాపం ఆమ్రపాలి..

పాపం ఆమ్రపాలి..

-  ఆ మాత్రం తెలుగు రాకపోతే ఎలా?

- నవ్వులపాలైన ఆమ్రపాలి!

 కలెక్టర్ ఆమ్రపాలి.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ పేరును పరిచయమూ చేయనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అందరికీ తెలిసిన ఐఏఎస్ అధికారి. ఇక వరంగల్ జిల్లా ప్రజల్లో అయితే ఆమె ఏకంగా గుడి కట్టి విగ్రహాలు పెట్టేంత అభిమానం సంపాదించుకున్నారు. గత ఏడాది వినాయక చవితి రోజు ఇది నిరూపితమైంది కూడా. అయితే ఈమె ఎంతపేరు సంపాదించుకున్నారో అంతే రీతిలో ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే జనవరి-26న గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

వరంగల్ అర్బన్ జిల్లాలో కూడా ఆమ్రపాలి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఇదంతా ఓకే ఆ తర్వాత జరిగిన వ్యవహారమే కలెక్టర్‌ను వార్తల్లో నిలిచేలా చేసింది. హన్మకొండ పోలీసు పరేడ్‌ మైదానంలో ఆమ్రపాలి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అయిపోయింది. పోలీసుల చేత ఆమ్రపాలి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యక్రమంలో ఆమె మాట్లాడి.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లా గురించి జిల్లాలో ఇంత వరకూ ఏం సాధించాం అని ప్రగతి గురించి ఎంతో హుందాగా మాట్లాడిల్సిన ఆమ్రపాలి నలుగురిలో నవ్వుల పాలయ్యారు.
గణతంత్ర వేడుకల కార్యక్రమంలో ఆమ్రపాలి ప్రసంగిస్తూ మధ్య మధ్యలో అనవసరం నవ్వడం, ఏ కారణం లేకుండా ‘ఈ..’ అని నవ్వడం, గణాంకాల దగ్గర తడబడ్డారు. అంతేకాదు చేసింది తప్పని తెలిసి కూడా ప్రసంగం మధ్యలో ‘ఇట్స్ ఫన్నీ’ అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇందుకు ముఖ్య కారణం ఆమె ఇలా నవ్వుల పాలు కావడానికి కారణం తెలుగు ప్రసంగం. ఆమ్రపాలికి తెలుగు అంతంత మాత్రమే వస్తుంది. అయితే ఈ వేడుక సందర్భంగా తెలుగులో అందర్నీ మెప్పించాలనుకున్న ఆమ్రపాలి నవ్వులపాలయ్యారు. తెలుగులో మాట్లాడుతూ పదాలు సరిగ్గా చదవలేక తడబడ్డారు మరీ ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి మాట్లాడేటప్పుడు ఏకంగా వెనక్కి తిరిగి నవ్వుకుంటూ తనలోతాను ‘ఇట్స్ ఫన్నీ’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదంతా మైకుల ద్వారా ప్రసారం కావడంతోపాటు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

ఐఏఎస్ స్థాయి అధికారి ఒక జిల్లాలో పనిచేస్తున్నారంటే ఆ జిల్లాకు చెందిన స్థితి గతులతో పాటు బాషా వగైరా తెలిసుండాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ఐఏఎస్‌లు ఇతర రాష్ట్రాల్లో పనిచేయడం అక్కడి కలెక్టర్లు తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడం మామూలే. అందుకే కాస్తో కూస్తో స్థానిక భాషపైనా పట్టుపెంచుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఆమ్రపాలి విషయానికొస్తే సుమారు రెండేళ్ల నుంచి కలెక్టర్‌గా వరంగల్ జిల్లాలో బాధ్యతలు చేపడుతున్నారు. కానీ కనీసం చూసి చదివడానికి కూడా రాకపోతే ఎలా? కలెక్టరే ఇలా మాట్లాడితే ఎలా? సిన్సియర్ ఆఫీసర్‌‌లో సీరియస్‌నెస్ లోపించింది? అంటూ నెటిజన్ల నుంచి  విమర్శలు వస్తున్నాయి. పోనీ తెలుగులో చదివారే అనుకో చిన్నపాటి జాగ్రత్తలు కూడా తీసుకోకుండా స్పీచ్ ఎలా ఇస్తారు?    మీరు ఆంద్ర వారు. మీ నాన్న గారిది విశాఖ..మీ వయసు 35....తెలుగు గడ్డ పైనే పుట్టి పెరిగావ్ సిగ్గు లేదా తెలుగు సరిగా రాదా? అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఆమ్రపాలి వివరణ ఇస్తారేమో వేచి చూడాల్సిందే.

Related Posts