విశాఖపట్నం
భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సి ఆర్ జెడ్ (కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంగించి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి కుమార్తె పెనకా నేహా రెడ్డి ఏర్పాటుచేసిన సుమారు 249 మీటర్ల కాంక్రీట్ ప్రహరీ గోడ విషయంలో చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశానుసారం మంగళవారం రాత్రి జీవీఎంసీ సిబ్బంది నోటీసులు జారీ చేసారు. బుధవారం ఉదయం అక్రమ నిర్మాణాలను యంత్రాల సహాయంతో తొలగించారు.