YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అదిలాబాద్ కు దారేదీ నిలిచిపోయిన రాకపోకలు

అదిలాబాద్ కు దారేదీ నిలిచిపోయిన రాకపోకలు

అదిలాబాద్, సెప్టెంబర్ 4 
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల ఉధృతికి రోడ్లు తెగిపోయి పలుచోట్ల వంతెనలు కొట్టు కుపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేయడంతో పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తర లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఎగువ మహారాష్ట్ర వర్షాలకు తోడు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సాగునీటి ప్రాజెక్టు జలాశయాలన్నీ ఉగ్రరూపాన్ని తలపిస్తున్నాయి. కడెం ప్రాజెక్టు లోకి ఊహించని విధంగా భారీగా వరద నీరు చేరడంతో ప్రమాదాన్ని పసిగట్టిన ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం ఉదయమే 18 గేట్లు ఎత్తివేసి 2 లక్షల 19 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి లోకి వదిలి ఊపిరి పీల్చుకున్నారు. కడెం ప్రాజెక్టు నీటిమట్టం 700అడుగులకు గాను 690 అడుగుల స్థాయిలో మెయింటేన్ చేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని, ప్రాజెక్టు గేట్లు సురక్షితంగా ఉన్నాయని ఇరిగేషన్ ఈ రాథోడ్ విట్టల్ తెలిపారు.శ్రీపాద ఎల్లంపల్లిలోకి భారీ వరద మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి భారీ వరద నీరు చేరడంతో పరిసర గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. రికార్డు స్థాయిలో 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెట్టారు. గుండి వాగు ఉధృతంగా ప్రవహించడంతో 22 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కొమురం భీం జిల్లా మాలనుకొంది వంతెన వరద ఉధృతికి కొట్టుకు పోయి 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నిర్మల్ డివిజన్లోని బైంసా పట్టణంతోపాటు తానూర్ కుబీర్ మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, పెన్ గంగా, ప్రాణహిత నదులు పొంగిపొర్లు తున్నాయి. జైనథ్ మండలం సరిహద్దులోని పెనుగంగా వంతెనకు కొద్ది అడుగుల దూరంలోనే వరద ఉధృతి పెరగడంతో జిల్లా కలెక్టర్ రాజార్జి షా, ఎస్పీ గౌస్ ఆలం, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వరద తాకిడి ప్రాంతాలను సందర్శించారు. నీట మునిగిన పంటలను ఆయా ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఫసల్ బీమా యోజన ద్వారా రైతులను ఆదు కోవాలని డిమాండ్ చేశారుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం కురిసిన వర్షాలు వరదలకు జనం అవస్థలు పడ్డారు. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లో లెవెల్ వంతెనల మీదుగా ప్రవాహం కొనసాగింది. అనేక చోట్ల పంటలు నీటి మునిగాయి. నివాస గృహాల్లోకి చుట్టూ వరద చేరింది. అనేక ఇల్లు నీలమట్టమయ్యాయి. మురుగు కాల్వలు, రోడ్లు అనే తేడా లేకుండా వరద ప్రవాహం కొనసాగింది. తాత్కాలిక రోడ్లు అనేకసార్లు కొట్టుకుపోయి రాక పోకలకు అంతరాయం ఏర్పడిందినిర్మల్ జిల్లా పరిధిలోని రెడ్డన్న ప్రాజెక్టులో ఈగోపంద నుండి వరద వస్తుండడంతో సుమారు 12000 పైచిలుకు క్యూసెక్కుల ఎవరిదనీరు దిగువన శుద్ధ వాగులోకి వదిలారు. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం అదే స్థాయిలో ఉందని డిఈ అనిల్ కుమార్ జాదవ్ పేర్కొన్నారు.ఖానాపూర్ మండలంలోని సదర్ మార్ట్ అనకట్ట లోకి ఎస్సార్ఎస్పీ గేట్లు తెరవడంతో భారీ స్థాయిలో నీరు చేరుతుంది, ఆనకట్ట సైడ్ వాళ్ల నుంచి పైకి ఉప్పొంగి ప్రవహిస్తుంది. సామర్ధ్యాన్ని మించి వరదరావడంతో సుమారు 50000 పైచిలుకు వరద నీరు గోదావరిలోకి వెళుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. మామడ మండలంలో గోదావరి పైన నిర్మించిన సదరమాట్ బ్యారేజీ 55 గేట్లకు గాను 48గేట్లు తెరిచి ఉంచారు. వచ్చిన నీరు వచ్చినట్లు వదిలేస్తున్నారు.నిర్మల్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీ చేరుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు ఉండగా వరద నీరు ప్రాజెక్టు సామర్థ్యాన్ని మించి రావడంతో గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీరును కిందికి వదులుతున్నారు.

Related Posts