YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రజలకు సూచించారు.బుధవారం మంథని పట్టణ శివారులో ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరినదీ నీటి ప్రవాహాన్ని భారీ వర్షం లోనే మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు.అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు అప్రమత్తంగా ఉన్నారని,విపత్తును ఎదుర్కోవడానికి మా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.
మహారాష్ట్రల కురుస్తున్న భారీ వర్షాలు, మన రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరద నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారని తెలిపారు. మంథని మునిసిపల్ ప్రాంతంలో  కాలువలలో మురికినీరును, అక్కడక్కడ చెత్తాచెదారాలను వెంట వెంటనే క్లీన్ చేయాలని మున్సిపల్ సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు,  గత ఐదు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల దోమల ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ గ్రామంలో విష జ్వరాలు వస్తే ఆ గ్రామాన్ని వెంటనే హెల్త్ క్యాంపు నిర్వహించి వారికి వైద్య సదుపాయం అందించాలన్నారు, మంథని నియోజకవర్గంలో ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రతి వ్యక్తికి మెరుగైన వైద్య సదుపాయాన్ని ఇవ్వాలని జిల్లా వైద్య అధికారులను మంత్రిగారు ఆదేశించారు
విపత్తును ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని,లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం వ్యవసాయ అధికారితో ఫోన్లో మాట్లాడుతూ ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అధికారులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఆ రైతులకు ధైర్యం చెప్పి స్పష్టంగా పంట నష్టం ఎంత జరిగిందో చూడాలని అధికారులను మంత్రిగారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా శంకర్ ముస్కుల సురేందర్ రెడ్డి, అజీమ్ ఖాన్, ఆకుల కిరణ్, గుండా పాపారావు లతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts