విజయవాడ
ఇంతవరకు ప్రమాదాన్ని అంచనా వేయడానికి.. పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి మాత్రమే ఈ డ్రోన్స్ను వాడేవాళ్లం. ఇప్పుడు ఏకంగా వరదలో చిక్కుకుపోయిన వారికి సహాయం అందించేందుకు కూడా ఉపయోగడపతున్నాయి డ్రోన్స్. విజయవాడ వరద భాదితులకు ఆహారం డ్రోన్ సాయంతో అందించారు అధికారులు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. చాలా ప్రాంతాల్లో ఇలానే డ్రోన్తో సేవలు అందిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. డ్రోన్తో వరద బాధితులకు సాయం అందించడం చాలా ఏళ్లుగా సాగుతుంది. కానీ గతంలో అక్కడ క్కడ మాత్రమే ఈ ఫెసిలిటీస్ ఉండేవి. కానీ.. ఇప్పుడు డ్రోన్లను వినియోగించడం చాలానే పెరిగిందని చెప్పాలి. రెస్క్యూ టీమ్స్ చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్స్ ఈజీగా వెళ్లిపోతున్నాయి. ఫుడ్ ప్యాకెట్స్, లైఫ్ జాకెట్స్, అవసరమైన తాళ్లు, మందులు, మంచినీరు.. ఇలా పని ఏదైనా క్షణాల్లో చేసేస్తున్నాయి డ్రోన్స్.