ఏలూరు
కొల్లేరు సరస్సులోకి వరద నీరు భారీగాచేరుతోంది. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు ల ప్రవాహాలు కలుస్తోన్నాయి. విజయవాడ ను ముంచెత్తిన బుడమేరు కొల్లేరులో కలుస్తుంది.రామిలేరు నూజివీడు, దెందులూరులలో నష్టం మిగిల్చింది. ఇక తమ్మిలేరు ఏలూరు మీదుగా ఉదృతంగా కొల్లేరులో చేరుతోంది.
ఏరులన్నీ కొల్లేరు లో ఏకమవడంతో కొల్లేరు సరస్సు నిండిపోయింది. భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు మెడికల్ వెస్టేజ్ తో సహజసిద్ధ సరస్సు నిండిపోయింది. మెడికల్ వ్యర్థాలు కూడా రావడంతో కొల్లేరులో మత్స్య సంపద, పక్షులకు ముప్పు పొంచివుంది. ఏలూరు - కైకలూరు, ఏలూరు - గుడివాకలంక ప్రధాన రహదారులపైకి కొల్లేరు నీరు చేరింది. కోమటిలంక, పైడిచింతపాడు గ్రామాలను వరద చుట్టుముడుతోంది. కొల్లేరు ముంపు ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలకి జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వీ ఆదేశాలు జారీ చేసారు.