YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వామ్మో... దత్తత గ్రామాలు సీఎం దత్తత గ్రామంలో దాహం దాహం..

వామ్మో... దత్తత గ్రామాలు సీఎం దత్తత గ్రామంలో దాహం దాహం..
నేతలు దత్తత తీసుకున్న గ్రామాలు అభివృద్ధికి నోచుకోవటం లేదు. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలంలోని కందకుర్తి గ్రామాన్ని నిజామాబాద్‌ ఎంపీ కవిత నాలుగేండ్ల క్రితం దత్తత తీసుకున్నా అక్షరాస్యత మినహా ఆశించిన పురోగతి లేదు. సబ్‌సెంటర్‌ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఎంపీ నిధుల ద్వారా రూ.5లక్షలతో గ్రామ ముఖద్వారం, ఎన్‌ఆర్‌జీఎస్‌ కింద మంజూరైన రూ.13 లక్షలతో జీపీ భవనం నిర్మించగా వారిఖాతాలో చూపేందుకు యత్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామాన్ని కరీంనగర్‌ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్‌ 2014లో దత్తత తీసుకున్నా ఫలితం అంతంతే. 49 లక్షలతో చేపట్టిన ఏడు అంగన్‌వాడీ భవన నిర్మాణాలు నాలుగేండ్లుగా పూర్తవలేదు. ఆదర్శ పాఠశాల వసతి గృహాల్లో డబ్బులు సరిపోలేదని మరుగుదొడ్లను ఆపేశారు. శీతల కేంద్రం ఊసేలేకపోగా లైబ్రరీ నిర్మాణం మధ్యలోనే ఆపేశారు. సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపాయి కూడా వెచ్చించలేదని సర్పంచ్‌ కోటమర్తి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్‌ యార్డు, శ్మశాన స్థలం ప్రధాన సమస్యగా ఉంది. కమ్యూనిటీ భవనం, వృత్తి శిక్షణా శిబిరాల్లేవు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు గొడం నగేష్‌ దత్తత తీసుకున్న బోథ్‌ మండలం పట్నాపూర్‌ గ్రామం కేంద్ర ప్రభుత్వ 'సంసద్‌' పథకానికీ ఎంపికైంది. 237 గృహాలుండగా ఎంపీ రూ.25 లక్షలతో పనులు చేపట్టారు. బోథ్‌ నుండి పట్నాపూర్‌ వరకు రోడ్డు లేదు. రూ.12లక్షలతో నిర్మించిన వాటర్‌ ప్లాంట్‌ నిరుపయోగంగా మారింది. అంగన్‌వాడీ, హెల్త్‌ సెంటర్‌ భవన నిర్మాణాలకు రూ.15లక్షలు మంజూరైనా ప్రారంభించలేదు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలోని చింతకుంట్ల గ్రామాన్ని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మూడేండ్ల కింద దత్త తీసుకున్నారు. కృష్ణాజలాల సరఫరా లేక నీటి సమస్య వేధిస్తున్నది. కొన్ని కాలనీల్లో సీసీరోడ్లు వేసి వదిలేశారు. 60 ఏండ్లుగా 30 కుటుంబాలు పూరి గుడిసెలోనే నివాసముంటున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామంలో అంతర్గత విద్యుత్‌ లైన్లు వేయిస్తామని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి చెప్పినా ఒక్కటీ అమలు కాలేదు. రూ.10 లక్షలతో అంగన్‌వాడీ కేంద్రం మినహా పనులేవీ చేపట్టలేదు. గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం అమరవాయి గ్రామానికి నాగర్‌కర్నూల్‌ ఎంపీ నందిఎల్లయ్య రూ.25లక్షలు కేటాయించారు. రూ.5 లక్షలతో మురుగు కాల్వలు, 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు చేపట్టినా ఇప్పటిదాకా గ్రామాన్ని పరిశీలించలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లా దామరగిద్ద మండలం మొగలిగిద్దకు మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి రూ. 46 లక్షలు కేటాయించినా ఖర్చు చేయలేదు. మురుగు కాల్వలు, వాటర్‌ప్లాంట్‌ లాంటి పనులతోనే సరిపెట్టారు. 5,500 జనాభా ఉన్నా జీపీ భవనం కూడా లేదు. పాఠశాల అదనపు గదులు మూడేండ్లయినా నేటికీ పూర్తి కాలేదు. 'ఒక్కసారి కూడా ఎంపీ రాలేదు. గ్రామ సమస్యలు ఎలా తీర్చగలరు' అంటూ చంద్రయ్య అసహనం వ్యక్తపరిచాడు.తన సొంత గ్రామం నిర్మల్‌ మండలం ఎల్లపల్లిని మం త్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దత్తత తీసుకున్నా..ఒకే కార్మికుడు ఉండడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. 480 కుటుంబాలు, 1800 జనాభా ఉండగా గ్రామశివారు వరకు విద్యుత్‌ సౌకర్యం, దీపాలు లేవు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక అవస్థలు పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రం శిథిలావస్థలో ఉందగా మహిళలకు ఐకేపీ భవనం లేదు. శ్మశానవాటికలో సౌకర్యాలు కరువయ్యాయి. 45 మంది లబ్దిదారులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మినహా మరేమీ చేయలేదని ఆరోపణలున్నాయి. జనగామ మండలం పెంబర్తి గ్రామాన్ని కడియం శ్రీహరి ఎంపీగా ఉన్నప్పుడు దత్తత తీసుకోగా.. మంత్రిగా కూడా అదేగ్రామాన్ని ఎంచుకున్నారు. 10 లక్షల రూపాయలు కేటాయిస్తే సీసీ రోడ్డు వేశారు. అంతకుమించి అభివృద్ధి జరగలేదు. ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లిని సుందరంగా తీర్చుదిద్దుతానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీలిచ్చారు. దళిత జనాభే ఎక్కువగా ఉన్నా ఒక్కరికీ మూడెకరాలు అందలేదు. 6 లక్షలతో నిర్మించిన దోబీఘాట్‌ ప్రారంభించి వదిలేశారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నలముల్క నూర్‌లో 2015లో హరితహారం సందర్భంగా సీఎం కేస ీఆర్‌ సందర్శించారు. అభివృద్ధికి నోచలేదని దత్తత తీసుకు న్న మరుసటి నెలలోనూ సందర్శించారు. కూలిపో తున్న మట్టిఇండ్లను చూసి ఏకంగా 247డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయడంతో పాటు ఏడాదిలోనే పూర్తి చేస్తామ న్నారు. కాంట్రాక్ట్‌ అప్పగించి 243 పూర్తిచేయగా మరో నాలుగు చివరి దశలో ఉన్నాయి. గ్రామంలో 681 కుటుం బాలుండగా ఇండ్ల మంజూరు నాటికి మరో 35 కుటుంబాల కు ఇండ్లులేనట్టు తేలింది. రెండోదశలో ఇస్తామన్నారు. మొద టి దశ ప్రారంభానికే నోచుకోక రెండో దశ ఊసే లేకుండా పోయింది. రోడ్ల వెడల్పులో మరో 35 కుటుంబా లు ఇండ్లు కోల్పోయి వీధిన పడ్డాయి. గ్రామంలో 70నివాసాలు లేని కుటుంబాలు లెక్కతేలాయి. దత్తత అనంతరం వాటర్‌ప్లాంట్‌ నెలకొల్పినా నీరందడం లేదు. అర్హులైన విక లాంగులకు ఫించన్‌ రావడంలేదు. కొత్త జిల్లా ల ఏర్పాటు అనంతరం ఆ గ్రామంవైపు తొంగిచూసిన నాథుడే కరువ య్యాడు

Related Posts