YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రాజెక్టల పేర్లు కొనసాగించాలి

ప్రాజెక్టల పేర్లు కొనసాగించాలి

నెల్లూరు
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గోన్నారు.
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ  వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంది.  జగన్ కోరిక గౌతమ్ రెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ నుంచి పోటీ చేశారు.. తర్వాత మంత్రిగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.  సంగం బ్యారేజ్ కి మేకపాటి గౌతమ్ రెడ్డి అని పేరు పెడితే.. దాన్ని తొలగించడం దారుణం.  నెల్లూరు బ్యారేజ్ కి నిజాయతీపరుడుగా ఉన్న నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెడితే దాన్ని సైతం తీసేయ్యడం దుర్మార్గం.  అధికారం శాశ్వతం కాదనే విషయాన్నీ చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి.. ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చెయ్యకపోవడం చంద్రబాబు ట్రాక్ రికార్డు. రాజశేఖరరెడ్డి చెప్పినవి.. చెప్పానవి కూడా చేసారు.. అయన బతికి ఉంటే మూడుసార్లు సీఎం అయ్యేవారు.. రాష్టం విడిపోయేది కాదు.  అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు వినలేదు.. ఇప్పుడు వరదలతో మునిగిపోయింది.  శేష జీవితంలో అయినా.. ప్రజలకు మేలు చెయ్యాలనే ఆలోచన చంద్రబాబుకి రావాలి.  నా వంతు సాయంగా ఏపీకి 25 లక్షలు, తెలంగాణకి 25 లక్షలు విరాళం ఇస్తున్నానని అన్నారు.మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ  గౌతమ్ రెడ్డి కోసమే జగన్ మూడు సార్లు జిల్లాకి వచ్చారు.. అయన జ్ఞాపకర్థం సంగం బ్యారేజ్ కి ఆ పేరు పెట్టారు.  వాటిని తొలగించడం వల్ల చంద్రబాబుకి వచ్చిన లబ్ది ఏంటో అర్ధం కాలేదు.  బ్యారేజ్ లకి పేర్లు మార్చడం పై చంద్రబాబు మీద ప్రజలు అసహ్యహించుకుంటున్నారు.  రెండు బ్యారేజ్ లకి ఆవే పేర్లు కొనసాగించాలని అన్నారు.

Related Posts