YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైడ్రా పేరిట బెదిరింపు… కేసు నమోదు

హైడ్రా పేరిట బెదిరింపు… కేసు నమోదు

సంగారెడ్డి
అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఎంకార్ ప్రాజెక్టు LP ను నిర్మిస్తున్న బిల్డర్ కు హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.  హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తి  పై  బిల్డర్లు  వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి   పిర్యాదు చేసారు.  సోషల్ యాక్టివిస్ట్ , సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకొని నిర్మాణం పనులు చూడడానికి వస్తున్న కస్టమర్లకు అసత్య ప్రచారం చేస్తున్నాడు. హైడ్రా కమిషనర్  రంగనాథ్ తో దగ్గరి పరిచయం అని చెప్పి కలిసి దిగిన  ఫోటోలు  చూపి విప్లవ సిన్హా అనే వ్యక్తి  వాట్స్అప్ కాల్ చేసి బెదిరించాడు.
పిస్తా హౌస్ వద్ద కలుద్దామని చెప్పి అక్కడికి పిలిచి హైడ్రా రంగనాథ్  తో కలిసి దిగిన ఫోటోలు చూపిస్తూ, రంగనాథ్ తనకు బాగా దగ్గరని అమీన్పూర్ లో ఎలాంటి విషయమైనా తననే అడుగుతారని బెదిరించాడు.  మీ నిర్మాణం జోలికి రావద్దు అంటే తనకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు. హైడ్రా నందు ఫిర్యాదు చేస్తానని, ప్రతిరోజు వార్తాపత్రికల్లో మీ నిర్మాణం గురించి తప్పుగా రాయిస్తానని బెదిరించారు.బాధితుడి పిర్యాదు తో అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలుశిక్ష  హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ హెచ్చరిక.
హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ హెచ్చరించారు. కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం అక్రమ నిర్మాణాల తొలగింపులు చేపడుతున్న నేపథ్యంలో కొద్దిమంది సామాజిక కార్యకర్తల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు. బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్ల ను ఇది అక్రమ నిర్మాణమని, బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు.అలాగే అధికారులతో ఉన్న ఫొటోలు చూపించి హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయని, మీకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని ఇందుకోసం కొంత డబ్బు ముట్టజెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని కొంతమంది వ్యక్తులు, సంస్థలు, బిల్డర్లను, బహుళ అంతస్తులు, వ్యక్తిగత గృహల్లో నివాసం ఉంటున్న వారి వద్ద ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడినా ఇతర ప్రభుత్వ విభాగలైన రెస్క్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాల్లో ఇలా ఒత్తిడి చేస్తే ప్రజలు, బిల్డర్లు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గాని ఎస్పీ, సీపీకి గాని లేదా హైడ్రా కమిషనర్, ఏసీబీకి  ఫిర్యాదు చేయాలన్నారు. ఈ విభాగాన్ని నీరు గార్చాలని చూసినా, తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Posts