YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వడివడిగా పంచాయితీల అడుగులు

వడివడిగా పంచాయితీల అడుగులు
పంచాయతీ ఎన్నికలను కొత్త చట్టం ప్రకారమే నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల వారీగా ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులగణన పూర్తిచేసింది. ఓటరు జాబితా దాదాపుగా ఖరారైంది. దీనిని ప్రభుత్వానికి అందజేయడంతో పాటు గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారు. దీని ఆధారంగానే సర్పంచులు, వార్డుల రిజర్వేషన్ల నిర్ణయం జరుగుతుంది. రిజర్వేషన్లు ఖరారు కాగానే ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్తగా తండాలు, గూడాలు పంచాయతీలుగా ఏర్పడిన క్రమంలో అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. ఎన్నికల సమాచారం అందరికీ అందుబాటులో ఉంచేందుకు ఈసీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. ఇక ప్రభుత్వం తొలిసారిగా ‘టీఈ-పోల్’ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది వివరాలను నెట్‌లో, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందు బాటులో ఉంచనున్నారు. ఓటరు చీటీల నుంచి నామినే షన్ల ప్రక్రియ వరకు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో వివరా లను ఉంచనున్నారు. ఓటరు జాబితాలో పేర్ల గల్లం తుపై కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ వెబ్‌సైట్‌లోనే చూసుకోనే అవకాశం ఉంది. కీలకమైన పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక్కో గ్రామం లో ఎన్ని పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటి మార్గాలు, సమస్యాత్మక ప్రాంతాలు వంటి వివరాలను సేకరిస్తున్నారు. రూట్ మ్యాప్‌లను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.  ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు ఈసీ అనుమతిచ్చింది. రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని దాదాపు 50కిపైగా మండలాల్లో జాబితా సవరణ చేపట్టనున్నారు. కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లో కాకుండా ఒకే వార్డులో ఉండేలా జాబితాలను సవరించాలని ఆదేశిం చింది. ఈనెల 5న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శిం చగా.. 8న తుది జాబితా ప్రకటించే అవకాశం ఉంది.

Related Posts