YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వర్షకాలం వచ్చిందంటే... భయం...భయం

 వర్షకాలం వచ్చిందంటే... భయం...భయం
వర్షాకాలం దృష్ట్యా ఇప్పటికైనా ఆస్పత్రిలో భయం...భయం.. అధికారులు పై కప్పు లీకేజీ మరమ్మతు పనులు చేపడితే.. తప్ప ప్రమాదం జరుగక మానదు.. చిన్నపాటి వర్షానికే పెచ్చులూడుతున్న ఐడీ, సర్జికల్‌, పే రూంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి పై కప్పు మరమ్మతు చేపట్టాలని రోగులు సిబ్బంది కోరుతున్నారు.రెండేళ్ల క్రితం పిల్లల వార్డులో తెల్లవారుజామున 3 గంటలకు అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధం.. పైకప్పు పెచ్చులూడి నిద్రిస్తున్న రోగులపై పడింది. ఈ ఘటనలో ఏడాది వయసున్న పాపతో పాటు ఆమె తల్లిదండ్రులకు తీవ్ర గాయాలై త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై స్పందించిన అప్పటి పాలనాధికారి పిల్లల వార్డు మరమ్మతు నిమిత్తం రూ.10 లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ వార్డును పూర్తి స్థాయిలో మరమ్మతు చేయాలని ఆదేశించారు. అదే తరహాలో శిథిలావస్థలో ఉండి తరచూ పెచ్చులూడుతున్న ఐడీ, సర్జికల్‌, పే రూంలతో పాటు ఇతర వార్డుల్లో ఉన్న పై కప్పు లీకేజీలను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయించాలని పాలనాధికారి అధికారులను అదేశించారు. గతేడాది జిల్లా ఆసుపత్రిని సందర్శించిన పాలనాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆసుపత్రిలో క్యాజువాలిటీ నిర్మాణంతో పాటు, ఇతర మరమ్మతు పనుల నిమిత్తం రూ.80 లక్షలు మంజూరు చేశారు. గతేడాది ఆసుపత్రి మరమ్మతు పనులను చేజికించుకున్న కాంట్రాక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పూర్తి చేయాల్సి ఉన్నా.. ప్రారంభించనేలేదు.. అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు.కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యం నిమిత్తం 13 పే రూంలు(రోజుకు రూ.200) ఏర్పాటు చేసినా.. కొన్నేళ్లుగా వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో కేవలం మూడు రూంలు మాత్రమే రోగులకు అందుబాటులో ఉన్నాయి. చిన్నపాటి మరమ్మతులు చేస్తే కొన్ని రూంలు వినియోగంలో వస్తాయి. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రూంలు ఉండీ నిరుపయోగంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది పే రూంలలో మరమత్తు పనులు ను చేజికిచ్చుకున్న గుత్తేదారు నేటికీ పే రూం మరమ్మతు పనులు ప్రారంభించకపోవడంతో రోగులు, సిబ్బంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.
గతేడాది మార్చిలో జిల్లా ఆసుపత్రిని సందర్శించిన పాలనాధికారి ఆసుపత్రిలో మరమ్మతు పనుల నిమిత్తం రూ.80 లక్షలు మంజూరు చేస్తూ.. మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గతేడాది రూ.60 లక్షలతో ఆసుపత్రి మరమ్మతు పనులను చేజిక్కించుకున్న కాంట్రాక్టర్, ఈ ఏడాది ఫిబ్రవరి వరకు, క్యాజువాలిటి నిర్మాణ పనులతో పాటు, ఐడీ వార్డు, పేరూంలు, ఇతర వార్డుల్లో పై కప్పు లీకేజీ పనులు, ఇతర మరమ్మతు పనులు పూర్తి చేయాల్సి ఉంది. గడువు ముగిసి నెలలు గడుస్తున్నా.. క్యాజువాలిటీ పనులు మినహా, మిగిలిన మరమ్మతు పనులు కనీసం ప్రారంభించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Related Posts