విజయవాడ
కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పంటు మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును పరిశీలించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి మరో ప్రాంతానికి పరిశీలనకు వెళ్లారు.