YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయనగరాన్ని వణికిస్తున్న వైరల్ ఫీవర్స్

విజయనగరాన్ని వణికిస్తున్న వైరల్ ఫీవర్స్

విజయనగరం, సెప్టెంబర్ 9
విజయనగరం జిల్లాలో వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విజృంభిస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో నేలంతా చిత్తడిగా మారి పారిశుధ్య సమస్య తాండవిస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న జ్వరాలను అదుపు చేయటం వైద్యాధికారులకు సైతం కష్టతరంగా మారింది. రోగుల సంఖ్య అధికంగా ఉండటంతో హాస్పిటల్ లో వైద్య సేవలు సైతం సవాల్ గానే మారాయి.ఉమ్మడి విజయనగరం జిల్లాలో విరుచుకుపడుతున్న విషజ్వరాలు జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సాలూరు, పాచిపెంట, మక్కువతో పాటు గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లో జ్వరాలు ప్రబలుతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంటుంది. కురుస్తున్న వర్షాల కారణంగా దోమల స్వైర విహారంతో జ్వరాలు మరింత పెరుగుతున్నాయి.జిల్లాలో మలేరియా, టైఫాయిడ్ తో పాటు ఇప్పుడు డెంగ్యూ అధికంగా ప్రభలుతుంది. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య నరకం చూపిస్తుంది. మురుగు కాలువలు, రోడ్లు చిత్తడిగా మారడంతో స్థానికులు దుర్వాసనలతో కాలం గడపాల్సి వస్తుంది. మురుగు నుండి వస్తున్న దోమలు ఏజెన్సీవాసులని నరకం చూపిస్తుంది. దోమకాటుతో మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు ప్రభలుతున్నాయి.పది రోజుల వ్యవధిలో జియ్యమ్మవలస మండలం బట్టలభద్రలో డెంగ్యూ కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. వారిలో ఓకే కుటుంబానికి చెందిన తల్లి, కూతురు మృతి చెందటం అందరినీ కలిచివేసింది. జ్వరాలను అదుపు చేసేందుకు గ్రామాల్లో పలురకాల పారిశుద్ధ్య పనులు చేపట్టినా కురుస్తున్న వర్షాలతో అంతగా ప్రయోజనం ఉండటం లేదు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా జ్వరాలు అదుపులోకి వస్తున్న పరిస్థితులు లేవు. సాధారణ జ్వరం అనుకుని ఇంట్లోనే వైద్య సేవలు పొందితే కొద్ది గంటల్లోనే జ్వరాల తీవ్రత పెరిగి ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాల మీదకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. జ్వరాల కారణంగా పట్టణాల బాట పడుతున్నారు రోగులు.మెరుగైన వైద్యం కోసం కార్పోరేట్ హాస్పిటల్స్ కి వెళితే అక్కడ వేల రూపాయలు ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంటుంది. అక్కడ కూడా రోగుల తాకిడి పెరగడంతో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. బెడ్స్ కూడా ఖాళీ లేక ఒక్కో బెడ్ పై ఇద్దరు, ముగ్గురు రోగులు ఉంటున్నారు. సెలైన్ బాటిల్స్ పెట్టాలన్నా వైద్యులకు అవస్థలు తప్పడం లేదు. జ్వరాల ఉదృతితో జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది

Related Posts