YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో ఆధార్ ప్రామాణికంగా సేవలు

తిరుమలలో  ఆధార్ ప్రామాణికంగా సేవలు

తిరుమల, సెప్టెంబర్ 9,
తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుండి వెలువడనుందని వివరించారు. ఫలితంగా దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చని చెప్పారు.
అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ….శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీ నుంచి దర్శనం టోకెన్ లేని వారికి ఆధార్ తో లడ్డూలను అందించే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టిందని ప్రకటించారు.⁠గత కొన్నేళ్లుగా పలువురు దళారులు లడ్డూల బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించాం. తిరుమలలో దళారి వ్యవస్థను అరికట్టి, స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, దర్శనం టోకెన్లు లేనివారికి ఆధార్ కార్డుపై రోజువారి రెండు లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, బయట ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆలయాలు, చెన్నై, బెంగళూరు, వెల్లూరులలోని టీటీడీ సమాచార కేంద్రాలలో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికి మేము పంపలేకపోయాము. ప్రస్తుతం పంపిస్తున్నాం. గత నాలుగు రోజుల్లో దాదాపు 75 వేల లడ్డూలు పంపబడ్డాయి” అని ఈవో శ్యామలరావు వివరించారు.తిరుమలలో దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు, రూ.50/- ప్రాతిపదికన కోరినన్ని లడ్డూలు (స్టాక్ లభ్యత ఆధారంగా) అందజేస్తున్నామని స్పష్టం చేశారు. దీనికి ఆధార్ కార్డు అవసరం లేదన్నారు. ఆవు నెయ్యి నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు, సువాసన, రంగు, రుచి ఉండే నెయ్యి కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న టెండర్ షరతులను అనుసరించి నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ పెట్టడం జరిగిందని వెల్లడించారు.కాలినడకన వచ్చే భక్తులకు అలిపిరి పాదాలమండపం వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయు కౌంటర్లు మరియు గాలిగోపురం వద్ద స్కానింగ్ కౌంటర్లను త్వరలో పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో పేర్కొన్నారు. “ ⁠శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు, ముఖ్యంగా అక్టోబర్ 8వ తేదీ శ్రీవారి గరుడసేవను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. ⁠ ⁠జూన్ నెల మొదటి వారంలో యాత్రికులకు వారానికి 1.05 లక్షల ఎస్ఎస్ డి టోకెన్లు ఇవ్వగా, ఇప్పుడు వారానికి 1.63 లక్షల టోకెన్‌లు జారీ చేస్తున్నాం. ఎస్ఎసడి టోకెన్స్ పెంచిన కారణంగా ఈ టోకెన్ పొందిన భక్తుల నిరీక్షించే సమయం గణనీయంగా తగ్గింది” అని ఈవో ప్రకటించారు.త్వరలో బెంగళూరుకు, హైదరాబాద్ కు చెందిన నిపుణులు తిరుమల లోని వివిధ అన్నప్రసాద కేంద్రాలను సందర్శించనుందని ఈవో తెలిపారు.⁠అన్నప్రసాద విభాగాన్ని ఆధునికరించడంతో పాటు అన్నప్రసాదాల పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసే చర్యలు తీసుకుంటామన్నారు.⁠వీరందించే సూచనల మేరకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అన్నప్రసాద విభాగాన్ని శాశ్వతంగా సంపూర్ణ స్థాయిలో ఆధునికరిస్తామన్నారు. ⁠శ్రీవారి భక్తుల నుదుటన పవిత్రమైన ”తిరునామం” ధారణ కార్యక్రమం, తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలలో శుక్రవారం నుండి పునఃప్రారంభిస్తున్నట్లు వివరించారు.

Related Posts