YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

కత్బుల్లాపూర్
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి. .దుండిగల్ మున్సిపాలిటీ పరిదిలోని కత్వ చెరువులో 170/1సర్వే నెంబర్ లో వెలిసిన ఎనిమిది విల్లాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు.  మల్లంపేట్ కత్వ చెరువు ఎఫ్టిఎల్ విస్తీర్ణం 142 ఎకరాలు. మల్లంపేట్ లో లక్ష్మీ శ్రీనివాస కన్ స్ట్రక్షన్స్  పేరుతో 2020-21 సంవత్సరానికే 320విల్లాస్ లను నిర్మించిది ఈ సంస్థ..అప్పటికే 60విల్లాలకు మాత్రమే హెచ్ఎండీయే  పర్మిషన్ తీసుకున్న ఈ సంస్థ మిగతావన్నింటిని ఫోర్జరీ పర్మిషన్ తో కన్స్ట్రక్షన్ చేసిందన్న ఆరోపణలతో అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్ నేతృత్వంలో డిపిఓ ఆద్వర్యంలో ఎంక్వైరీ చేసి 208విల్లాలకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని నోటీసులు జారీచేసారు.  సీజ్ చేశారు..హైకోర్ట్ ఆదేశాలతో ఈ అక్రమవిల్లాలకు కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్,రిజిస్ట్రేషన్ లను ఆపాలని,బ్యాంక్ అధికారులు లోన్ లను నిలిపివెయ్యాలని ఆర్డినెన్స్ జారీచేశారు..చట్టంలో ఉన్న  లొసుగులతో దుండిగల్ మున్సిపాలిటీ అధికారుల సహకారంతో  అక్రమ విల్లాలన్ని సక్రమవిల్లాలుగామారిపోయాయి.

Related Posts