YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

యువతిని చంపి.. వండుకుని తిని...

యువతిని చంపి.. వండుకుని తిని...

-  25 ఏళ్ల మహిళ తన మాజీ భర్త ఇంట్లో హత్య

-  స్టవ్‌పై ఓ గిన్నెలో ఆమె కాళ్లు, చేతులు

ఓ మహిళను చంపి.. వండుకుని తిన్న ఘటన మెక్సికోలో కలకలం సృష్టించింది. పోషకాహార నిపుణురాలిగా పనిచేస్తున్న మాగ్దలీనా ఆగ్విలార్ రోమెరో అనే 25 ఏళ్ల మహిళ తన మాజీ భర్త ఇంట్లో హత్యకు గురైంది. ఆమెను చంపేశాక శరీరావయవాలను వండుకు తిన్నారు దుండగులు. మెక్సికోలోని టాక్స్‌కో నగరంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. గతవారం తన మాజీ భర్త వద్ద నుంచి ఇద్దరు పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన ఆమె హత్యకు గురైందని గ్వెరెరో స్టేట్ అటార్నీ జనరల్ జేవియర్ ఓలియా తెలిపారు. స్టవ్‌పై పెట్టిన ఓ గిన్నెలో ఆమె కాళ్లు, చేతులను, ఓ బ్యాగులో అప్పటికే వండిన ఇతర శరీర అవయవాలను గుర్తించినట్టు ఓలియా చెప్పారు.

ఇక, మిగతా శరీర భాగాలను దుండగుడు ఫ్రిజ్‌లో దాచాడని చెప్పారు. ఆమెను చంపేసినప్పుడు ఆమె పిల్లలు అక్కడే ఉండి ఉంటారని, ఏం జరిగిందో వారికి తెలిసి ఉంటుందని చెబుతున్న అధికారులు.. ఈ కేసులో ఆ పిల్లల్నే ప్రాథమిక సాక్ష్యంగా పరిగణిస్తున్నారు. ఆమె భర్త ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అధికారి చెప్పారు. అతడి తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి ఆచూకీ చెప్పిన వారికి భారీ నజరానాను ప్రకటించింది ప్రభుత్వం. 

Related Posts