YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోడు.. అడవితల్లి గోడు

పోడు.. అడవితల్లి గోడు
రోజు రోజుకు మన్యంలో అడవి అంతరించిపోతోంది. పోడుపేరిట విచ్చలవిడిగా పచ్చని చెట్లను నరకి వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే  ఆక్సిజన్‌  శాతం తగ్గి కార్బన్‌ డైయాక్సైడ్‌ పెరిగిపోతోంది. ఇది మానవ జీవి తంపై తీరని ప్రభావం చూపుతోంది.వాతావరణంలో సమతౌల్యం ఉండాలంటే మొత్తం భూ బాగంలో 33 శాతం అడవులు ఉండాలి. అయితే అడవుల శాతం రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రస్తుతం 19 శాతానికి మించి అడవులు లేపు. దీనిని 33 శాతానికి పెంచాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అడవులు అంతరించి పోవడంతో  పాటు పెద్ద ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాల పొగ  భూ తాపానికి కారణంగా మారుతోంది. భూతాపంతో వ్యవసాయంలో 20 శాతం దిగుబడులను కోల్పోవలసి వస్తుంది. రానున్న కాలం లో దిగుబడులు మరింత పడిపోయే ప్రమాదం  ఉందని వ్యవసాయరంగ నిపుణుల అంచనా.
విశాఖ మన్యంలో గతంలో నైరుతి రుతుపవనాల రాకకు ముందుగా వర్షాలు కురిసేవి. వాటిని రుతుపవనాలకు ముందస్తు వర్షాలుగా పిలిచేవా రు. ఇవి గడచిన కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తే తగ్గిపోతున్నాయి. ఈ వర్షాల     తగ్గుదలకుఅడవులు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. ఇక 25–40 డిగ్రీ ల ఏటవాలుగా ఉన్న మన్యంలో ఏడాదికి 1,100 మిల్లీ్లమీటర్ల వర్షపాతం కురుస్తుంది. చెట్లు లేని కారణంగా మన్యంలో కురుస్తున్న వర్షాలకు కొండలపై నుంచి  వస్తున్న వరదనీరు  భూమిలో లవణాలు కొట్టుకుపోయేం దుకు కారణమవుతోంది. వాటి నివారణకు కట్టిన రాతికట్టు, తవ్విన కందకాలు ఆశించిన విధంగా ఉపయోగపడడం లేదు.
కొన్నేళ్ల కిందట పక్కనున్న ఒడిశా నుంచి మన్యం  వలస వచ్చిన ఆదివాసీలు భూమికోసం అడవిని నరికేస్తున్నారు. మన్యంలో అటవీ శాఖ ఏటా పెంచుతున్న అడవుల కంటే పోడు పేరిట కోల్పోతున్న అడవి ఎక్కువగా ఉంది. అటవీ అధికారులు  దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. 2005లో అమలులోకి  వచ్చిన అటవీ హక్కుల చట్టం తరువాత మన్యంలో పోడు సాగు పెరిగిపోయింది. వాటికి పట్టాలు ఇస్తారన్న నమ్మకంతో అడవిని నరికేస్తున్నారు.

Related Posts