YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పీఏసీ ఫైట్

 కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పీఏసీ ఫైట్

హైదరాబాద్, సెప్టెంబర్ 11,
తెలంగాణలో హాట్‌ టాపిక్.. పీఏసీ చైర్మన్‌ అంశం. అవును.. నిన్నటి నుంచి పీఏసీ చైర్మన్ పదవిపై రాజకీయ రగడ కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం నైతికమా? అనైతికమా? టెక్నికల్ టర్మ్స్‌ ఏం చెబుతున్నాయి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ.. సింపుల్‌గా PAC.. ఈ కమిటీకి చైర్మన్‌గా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమిస్తూ అసెంబ్లీ సెక్రటరీ బులెటిన్ రిలీజ్ చేశారు. నిజానికి అసెంబ్లీ రూల్స్ ప్రకారం బీఆర్ఎస్‌ పార్టీ నుంచి ముగ్గురు సభ్యులను PACకి ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్‌ ముగ్గురు సభ్యులను ఎన్నుకుంది. వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్‌, అరికెపూడి గాంధీని ఎన్నుకుంది. అయితే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడంతో. ఇదేక్కడి న్యాయం అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్.. ఇది సభా సంప్రదాయాలు, సభా మర్యాదలు, సభా నియమావళిని పట్టించుకోనట్టే అంటూ అంతెత్తు ఎగిరిపడుతోంది.నిజానికి పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇస్తారు. కానీ ఇప్పుడు టెక్నికల్‌గా అరికెపూడి గాంధీ బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవారే. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరింది బీఆర్ఎస్‌ పార్టీ.. కాబట్టి.. ఆయన పేరుకు కాంగ్రెస్‌లో ఉన్నా.. ఆయన బీఆర్ఎస్‌కు చెందిన సభ్యుడే.. అందుకే ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తికే ఇచ్చాం కదా అని చెప్పకనే చెబుతోంది కాంగ్రెస్ పార్టీ.. నిజానికి ఇది బీఆర్ఎస్‌కు మాస్ట్రర్ స్ట్రోక్.. నిజానికి బీఆర్ఎస్‌ హరీష్‌రావు పేరును సలహా చేసింది. అయితే వ్యూహాత్మకంగా గాంధీ పేరును తెరపైకి తీసుకొచ్చి ఆయనకు పదవిని కట్టబెట్టింది.అయితే తనకిచ్చిన పీఏసీ చైర్మన్‌గా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాననంటున్నారు ఆరికెపూడి గాంధీ.. ప్రస్తుతం తాను ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నాను కాబట్టి.. పీఏసీ పదవి ఇచ్చారని చెబుతున్నారు. అంతేకాదు అనర్హత వేటుపై కూడా ఆయన స్పందించారు. కోర్టు నిర్ణయం ఏదైనా తాను గౌరవిస్తానని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో నిజంగా బీఆర్ఎస్‌కు విమర్శించే హక్కు ఉందా? ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సంస్కృతిని స్టార్ట్ చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీనే కాబట్టి. 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలకు పీఏసీ పదవిని ఇవ్వలేదు కనీసం కోరినా పట్టించుకోలేదు. అప్పుడు బీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీకే పీఏసీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. ఇదేక్కడి న్యాయమని ప్రశ్నిస్తే.. అసలు కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదానే లేదని వాదించింది బీఆర్ఎస్‌.. ఆ తర్వాత కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకుంది. మరి ఇప్పుడేమో కాంగ్రెస్‌ అన్యాయం చేసిందంటూ నెత్తి నోరు బాదుకుంటుంది. అసలు ఈ ట్రెండ్‌ను సెట్ చేసింది మీరే కదా అనే విషయాన్ని మర్చిపోతే ఎలా అంటున్నారు కాంగ్రెస్ నేతలు.తప్పును తప్పు అని చెప్పడానికి ఓ అర్హత ఉండాలి.. మనం ఏ తప్పు చేయనివారమై ఉండాలి. అప్పుడే మనకు అడిగే హక్కు ఉంటుంది. దబాయించేందుకు అధికారం ఉంటుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్‌ ఆ పరిస్థితిలో లేదు.. బీఆర్ఎస్‌ ఒక మాట మాట్లాడితే.. కాంగ్రెస్‌ నేతలు వంద మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు చేసినప్పుడు రైట్ అయినప్పుడు. ఈ రోజు రాంగ్ ఎలా అవుతుంది అని నిలదీస్తున్నారు. టెక్నికల్‌గా మేము చేసింది తప్పు కాదు.రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నామన్న లాజిక్‌ను అయితే తెరపైకి తీసుకొస్తున్నారు కాంగ్రెస్ నేతలు..

Related Posts