YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జంపు జిలానీలపై చర్య తీసుకోవాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

జంపు జిలానీలపై చర్య తీసుకోవాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద ,పాడి కౌశిక్ రెడ్డి  తెలంగాణ భవన్  లో మీడియాతో మాట్లటాడారు. దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరి,తెల్లం వెంకట్రావుపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని హై కోర్టు చెప్పింది. చర్యలు ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీకి హై కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కాలయాపన చేయకుండా చర్యలు ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చామని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా  టైం పాస్ చేసే విధంగా  శ్రీధర్ బాబు మాట్లాడారు. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలి అంటే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలపై పిటీషన్ స్పీకర్ కార్యాలయంలో పెండింగ్ లో ఉంది. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుపై మాకు గౌరవం ఉంది. శ్రీధర్ బాబు తన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా మాట్లాడుతున్నారు. శ్రీధర్ బాబు మాటలు మాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. సుప్రీంకోర్టు బెంచ్ ఎమ్మెల్యేల అనర్హతపై కాలయాపన వద్దని గతంలో తీర్పు ఇచ్చిందని గుర్తు చేసారు. హై కోర్టు తీర్పును శ్రీధర్ బాబు వక్రీకరిస్తున్నారు. హై కోర్టు తీర్పును శ్రీధర్ బాబు అగౌరవ పరిచారు.  
ఎవరు పార్టీలోకి వచ్చినా చేర్చుకుంటామని శ్రీధర్ బాబు అంటున్నారు. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని దేశం మొత్తం రాహుల్ గాంధీ చెప్తున్నారు. పీఏసీ విషయంలో ఏ నిబంధనలు పాటించారో శ్రీధర్ బాబు చెప్పాలి. పీఏసీకి 14 మంది నామినేషన్ వేస్తే ఎన్నికలు జరిగాలి. కానీ పీఏసీకి దొంగచాటుగా అరికేపూడి గాంధీతో నామినేషన్ వేయించారు. మా పార్టీకి పీఏసీకి  ముగ్గురు నామినేషన్ వేశారని అన్నారు. నాలుగో పేరు మా పార్టీ తరపున ఎవరు ఇచ్చారో చెప్పాలి. హరీష్ రావు వేసిన నామినేషన్ ఏమైందో చెప్పాలి. అరికేపూడి గాంధీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు చెప్పాలి. హై కోర్టు తీర్పు తర్వాత బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి మోసం చేశారు. ...తడి బట్టతో రేవంత్ రెడ్డి వారి గొంతు కోశారు. .గ్యారంటీల పై ప్రజలను మోసం చేసినట్టే రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను మోసం చేశారు. పిరాయించిన వారు తిరిగి బీ ఆర్ ఎస్ లో చేరడానికి సిద్ధమైతే రేవంత్ రెడ్డి పోచారం ఇంట్లో హడావుడి గా విందు సమావేశం ఏర్పాటు చేశారు. .ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని అన్నారు.
ముందు కాంగ్రెస్ లో చేరిన వారికే పదవులు అంటూ ఊరించారు. పది మంది ఎమ్మెల్యేల భవిష్యత్ కు రాజకీయ సమాధి కట్టారు. హై కోర్టు తీర్పు తర్వాత పిరాయించిన ఎమ్మెల్యేలు ఆగమాగం అవుతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తధ్యం. పది ఎమ్మెల్యేల పరిస్థితి అయోమయంగా ఉంది ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు వారి పరిస్థితి తయారైంది.  ఎమ్మెల్యేలు వెనక్కి  వస్తామని అంటే డిస్ క్వాలిఫై చేయిస్తానని రేవంత్ రెడ్డి భయపెట్టారు. అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చిన పిటీషన్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్టాడుతూ ఎన్నికలు వస్తాయని తెలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు. పూటకో పార్టీ మారే దానం నాగేందర్ బిచ్చగాడు. దానం నాగేందర్ చీటర్. దా నాగేందర్ శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు,శరం లేదా...? రాజీనామా చేయండని అన్నారు.
కడియం శ్రీహరి  పచ్చి మోసగాడు. పొద్దున కేసీఆర్ దగ్గర బ్యాగులు తీసుకుని వెళ్లి
సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కడియం శ్రీహరి  స్టేషన్ ఘన్ పూర్ లో  డిపాజిట్ తెచ్చుకోవాలి. అరికేపూడి గాంధీ నేను  కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అంటున్నారు. నేను దేవుడు కండువా కప్పుకున్నానని అంటున్నారు. .కాంగ్రెస్ లో చేరానని గాంధి యే స్వయంగా మీడియా కు చెప్పి ఇపుడు మాట మారుస్తున్నారు. పార్టీ మారిన వారు హై కోర్టు తీర్పు తర్వాత గజగజ వణుకుతున్నారు. స్పీకర్ నిర్ణయం దాకా ఆగకుండా పిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కోవాలి. ఎపుడు ఎన్నికలు వచ్చిన ఆ పది సీట్లు బీ ఆర్ ఏస్సే గెలుస్తుంది. రికేపూడి గాంధీ నకిలీ గాంధీ. గత పదేళ్లల్లో సింగిల్ గా ఏ ఎమ్మెల్యేకు కండువా కప్పలేదు. .కేసీఆర్ విడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకున్నారని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నని అన్నారు.
కేసీఆర్ హయం లో బీ ఆర్ ఎస్ ఎల్పీ లో సీఎల్పీ విలీనం జరిగింది. వై ఎస్ హాయం లో ఫిరాయింపులను ప్రారంభించింది  కాగ్రెస్ పార్టీ. ఫిరాయింపుల చట్టం తీసుకువస్తామని చెప్పింది రాహుల్ గాంధీ. .అరికేపూడి గాంధీ మా పార్టీ సభ్యుడు అయితే తెలంగాణ భవన్ కు రావాలని అన్నారు.

Related Posts