చిత్తూరు జిల్లా పర్యటనలో రెండవ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ బిజీ గా గడిపారు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను సావధానంగా విన్నారు. వారు ఇచ్చిన వినతులను చంద్రబాబు నాయుడు స్వీకరించడంతో జనం పులకించి పోయారు. నవ నిర్మాణ దీక్ష, ఇఫ్తార్ విందు, కార్యకర్తల సమావేశం ముగించుకొని మదనపల్లెలో రాత్రి బస చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం మదనపల్లె ప్రజల వినతులను స్వీకరించారు. స్థానిక ఆర్ అంగ్ బి గెస్ట్ హౌస్ లో ఉదయం తనకోసం వచ్చిన ప్రజలను కలిశారు, పెద్దఎత్తున జనం తరలివచ్చి తమ సమస్యలపై వినతులను సమర్పించారు. మరోవైపు మునిసిపల్ ఉద్యోగిని లైంగికంగా వేదిస్తున్నాడని మునిసిపల్ కార్యాలయం మేనేజర్ రాంబాబు పై ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కు మునిసిపల్ ఉద్యోగి నాగరాణి పిర్యాదు చేసింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి రాంబాబు పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డి.ఐ.జి ప్రభాకర్ రావుకి సూచించారు. మదనపల్లెలో రాత్రి బస చేసిన చంద్రబాబు నాయుడు వెంటే కుమారుడు మంత్రి నారాలోకేష్ కూడా ఉన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న సమయంలో తండ్రి వెంటె ఉండి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.యువ నేత రావడంతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా కరచాలనం చేయడానికి ఎగబాకారు. .ప్రత్యేకంగా పలకరిస్తూ సమస్యలు సావధానంగా వింటూ వినతిపత్రాలు స్వీకరించారు.