YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాహుల్.... క్విట్ ఇండియా

రాహుల్.... క్విట్ ఇండియా

హైదరాబాద్
కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం రేవంత్ కు సాధ్యం కావడం లేదు
కేసీఆర్ ఢిలీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారు.
బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూసేటోళ్లం,
అంకుశం సినిమాలో రాంరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పట్టేది
కేసీఆరే దశమ గ్రహం నవగ్రహాలు చేయడం విడ్డూరం
వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు.
ప్రజలు కేసీఆర్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇగ రీ ఎంట్రీ కలే. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో హైడ్రామా లాడుతున్నరు.
దేశ ప్రజలారా. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగండి.
అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన డివిజన్ కార్యకర్తలను నేను సన్మానిస్తా.
ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ బీజేపీదే,
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడం తథ్యం
లౌకికవాదులారా.. జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదు?
హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరు?
జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించని వాళ్లు నా ద్రుష్టిలో భారతీయులే కాదు
శేరిలింగంపల్లి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  విదేశాల్లో పర్యటిస్తూ భారత్ ను కించపర్చడమే కాకుండా ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తున్న రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. మిస్టర్ రాహుల్ గాంధీ.  క్విట్ ఇండియా అని నినదించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని చెప్పిన బండి సంజయ్. అందరూ కలిసి పోటీ చేసినా ఈసారి  జీహెచ్ఎంసీపై కాషాయ జెండాను ఎగరేసి తీరుతామని, మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తడనుకున్న. కానీ రేవంత్ తో సాధ్యం కావడం లేదు. ఎందుకంటే కేసీఆర్ కు కాంగ్రెస్ లో ఎవరిని పట్టుకుంటే పనైతదో తెలుసు. అందుకే ఢిల్లీ పోయి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చిండు. అందుకే కేసీఆర్ కుటుంబం జోలికి రేవంత్ రెడ్డి వెళ్లడం లేదు. అదే బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ కుటుంబం అంతు చూసేటోళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డిని ఎట్లా గుంజుకుపోయి జైల్లో వేశారో, అట్లనే కేసీఆర్ కుటుంబాన్ని గుంజుకుపోయి జైల్లో వేసేటోళ్లం. ఎందుకంటే కేసీఆర్ అన్ని అరాచకాలు చేసిండు. అని పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి ఎస్సార్ కన్వెన్షన్ హాలులో రంగారెడ్డి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, కూన రవి కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
సభ్యత్వ నమోదు విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. ఇన్సూరెన్స్, ఇతర తాయిలాల ఆశ చూపకుండా సభ్యత్వ నమోదు చేయిస్తున్న పార్టీ బీజేపీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ డివిజన్ లో అత్యధికంగా సభ్యత్వాన్ని నమోదు చేస్తారో, ఆ డివిజన్ లోని బీజేపీ నాయకులందరినీ ఘనంగా సన్మానిస్తాం.
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా, అంతకుముందు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకు వంద శాతం మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకోవడం తథ్యం. ఎంఐఎం గోడదూకే పార్టీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. రాబోయే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు ఒక్కటై పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఎన్నికల్లో గెలుపు మనదే. జీహెచ్ఎంసీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఒవైసీ ఒక్కటై పోటీ చేసినా బీజేపీ ఎదుర్కొవడంతోపాటు గెలిచి తీరుతాం. జీహెచ్ఎంసీ ఎవడి అయ్య జాగీరు కాదు. ఎంఐఎం పార్టీ ఆనవాళ్లు లేకుండా చేస్తాం. తెలంగాణలో ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తాం.

Related Posts