అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హాల్లో లేపాక్షి మండల గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ఎమ్మెల్యే బాలకృష్ణ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కొడికొండ చెక్ పోస్టు నుంచి సిరా వరకు వెళ్లే జాతీయ రహదారికి భూములుకోల్పోయిన పోయిన రైతుల సమస్యలతో పాటు నియోజకవర్గ పెండింగ్ పనులను కూడా పరిష్కరించి భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం సాధ్యమైనంత ఎక్కువగా ఇవ్వాలని జిల్లా రెవిన్యూ అధికారులకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశించారు.