YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రంజాన్ తోఫాల పంపిణి

రంజాన్ తోఫాల పంపిణి
ఆరు వేలమంది ముస్లిం పేదకుటుంబాలకు రంజాన్ తోఫా క్రింద 4 రకాల నిత్యావసర సరుకులు రంజాన్‌లోగా అందించడం జరుగుతుందని శాసనసభ్యుడు బడేటి కోట రామారావు (బుజ్జి) చెప్పారు. వెంకన్నచెరువు సమీపంలోని కత్తేపువీధి ప్రాంతంలో శుక్రవారం రంజాన్ తోఫా క్రింద 150 మంది ముస్లిం కుటుంబాలకు బడేటి బుజ్జి సరుకుల కిట్‌లను అందజేసారు. పండుగ పర్వదినాలలో ఏకుటుంబం పస్ధుతో ఉండకూడదనే ఉద్ధేశ్యంతో ప్రతీ పేద కుటుంబానికీ రంజాన్, క్రిష్టమస్, సంక్రాంతి కిట్‌ల కానుకలను అందిస్తున్నట్లు బడేటి బుజ్జి చెప్పారు. ఏలూరు నగరంలో 4500 ముస్లిం పేదకుటుంబాలు ఉన్నట్లు తెల్లరేషన్ కార్డుల ద్వారా తేలిందని అదేవిధంగా రూరల్‌లో 1000 మందికి పైగా పేద ముస్లింలు ఉన్నారని వారందరికీ ఒక్కొక్కరికీ 285 రూపాయలు విలువైన ఐదు కిలోల గోథుమపిండి, రెండు కిలోల పంచదార, వంద గ్రాముల నెయ్యి, సేమ్యాప్యాకెట్లను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. సమాజంలో ప్రతీ పేద కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన పధకాలను ప్రవేశ##పెడుతున్నారని త్వరలోనే ఏలూరు నగరంలో అన్నాకేంటీన్లు ఏర్పాటుచేసి ఉదయం, రాత్రి టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం కేవలం 5 రూపాయలకే అందించే నూతన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఈమేరకు అన్నాకేంటీన్ భవనాలు పలు ప్రధాన సెంటర్లలో యుద్ధప్రాతిపదికపై నిర్మాణపనులు జరుగుతున్నాయని దీనివలన ఏఒక్కరూకూడా అర్ధాకలితో ఉండడానికి వీల్లేదని బడేటి బుజ్జి చెప్పారు. ఏలూరు మేయరు షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ రంజాన్‌తోఫా కానుకలు ప్రభుత్వం తరపునే కాకుండా నగరంలోని నాలుగువేల 500 పేద ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్కరికీ 250 రూపాయలు చొప్పున తమ గౌరవవేతనాన్ని అందించే కార్యక్రమం త్వరలో చేపడతామని గతంలో కూడా తమకు వచ్చిన గౌరవ వేతనాన్ని సమాజ సేవా కార్యక్రమాలకు వినియోగించామని నూర్జహాన్ చెప్పారు. ఈకార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు యస్‌యంఆర్. పెదబాబు, మాజీ డిప్యూటి మేయరు చోడే వెంకటరత్నం, కార్పోరేటర్లు జిజ్జవరపు ప్రతాప్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా కిట్‌లను బడేటి బుజ్జి, నూర్జహాన్, తదితరులు అందజేసారు. తొలుత ముస్లిం ప్రార్ధనామందిరాన్ని బడేటి బుజ్జి ప్రారంభించారు. 

Related Posts