YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సవాళ్లు... సమస్యలు 90 రోజుల పాలనపై అంచనాలు

సవాళ్లు... సమస్యలు 90 రోజుల పాలనపై అంచనాలు

విజయవాడ, సెప్టెంబర్ 13,
కూట‌మి ప్ర‌భుత్వం ప‌గ్గాలు చేప‌ట్టి.. 90 రోజులు పూర్త‌య్యాయి. సాధార‌ణంగా.. తొలి వంద రోజులు ప్ర‌శాంతంగా జ‌రిగిపోవాల‌నిఏ ప్ర‌భుత్వ‌మైనా కొరుకుంటుంది. ఫీల్‌గుడ్ భావ‌న ల‌భించాల నే ఆశిస్తుంది. వ‌చ్చిన తొలి రోజుల్లోనే ప్ర‌భుత్వం ఏదైనా చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మార్కులు కొట్టే యాల‌ని చూస్తుంది.త‌ద్వారా.. త‌ర్వాత పాల‌న ఎలా ఉన్నా.. తొలి 100 రోజుల పాల‌న‌ను చివ‌రి వ‌ర‌కు చెప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. కానీ, చిత్రంగా గ‌తంలో వైసీపీ స‌ర్కారుకు.. 200 రోజుల త‌ర్వాత‌.. క‌రోనా రూపంలో భారీ విప‌త్తు ఎదురొచ్చింది. అప్ప‌టి వ‌ర‌కు స‌చివాల‌యాల ఏర్పాటు, వ‌లంటీర్ల నియామ‌కం.. వంటి కార్య‌క్ర‌మాల‌తో ఉన్న స‌ర్కారు కు క‌రోనా రూపంలో వ‌చ్చిన పెద్ద విప‌త్తు అగ్ని ప‌రీక్ష‌గా మారింది.ఇది ఒక‌రోజు రెండు రోజుల కాదు.. ఏకం గా ఏడాదిన్న‌ర పాటు ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది. దీని నుంచి కోలుకునేలోగానే.. వ‌ర‌ద‌లు.. ఎల్జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న వంటివి ఇబ్బంది పెట్టాయి.ఇక‌, ఇప్పుడు కూట‌మి స‌ర్కారుకు కూడా ఇదే త‌ర‌హా ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆది నుంచి కూడా.. స‌ర్కారుకు ఇబ్బందులు త‌ప్ప‌లేదు. అన‌కాప‌ల్లి ఫార్మా కంపెనీలో త‌లెత్తిన విప‌త్తు ప‌దిమందికి పైగా ప్రాణాలు తీసింది. మ‌రోవైపు.. వైసీపీ వ‌ర్సెస్‌ టీడీపీ కుమ్ములాట‌తో ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులు చ‌నిపోయారు. ఈ స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్న నేప‌థ్యంలోనే విజ‌య‌వాడ‌కు వ‌ర‌ద వ‌చ్చింది. ఇది ప‌ది రోజులుగా వెంటాడుతూనే ఉంది.ఇంత‌లోనే విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, కాకినాడ స‌హా.. ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద బీభ‌త్సం.. తుఫాను వంటివి ఇబ్బందిగా మారాయి. దీంతో తొలి 90 రోజులుకూడా కూట‌మి స‌ర్కారు విప‌త్తుల‌తోనే యుద్ధం చేయాల్సి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే.. రెండు కీల‌క ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌భుత్వం ప్రారంభించింది.పెంచిన పింఛ‌న్ల‌ను ఇవ్వ‌డం.. అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించడం. ఇక‌, మిగిలిన వాటికి.. రూప‌క‌ల్ప‌న చేసే దిశ‌లో ఈ చిక్కులు రావ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. తొలి 90 రోజులు కూట‌మి స‌ర్కారు విప‌త్తుతోనే యుద్ధం చేయాల్సి వ‌చ్చింద‌నేది వాస్త‌వం.
4 ఏళ్ల తర్వాత పంచాయితీలకు డబ్బులు
ఏపీలోని గ్రామ పంచాయ‌తీల్లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. గతానికి భిన్నంగా ఇంకో మాట‌లో చెప్పాలంటే.. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో తొలిసారి పంచాయ‌తీలు.. ల‌క్ష రూపాయ‌లు క‌ళ్ల చూస్తున్నాయి. వాస్త‌వానికి బ్లీచింగ్ కొనుగోలు చేసేందుకే నిధులు లేక అల్లాడుతున్న ప‌రిస్థితిలో పంచాయ‌తీలు కునారిల్లు తున్నా యి. ఇలాంటి ప‌రిస్థితి నుంచి ఇప్పుడు కొంత మేర‌కు కోలుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. జ‌గ‌న్ పాల‌న కాలంలో కేంద్రం నుంచి వ‌చ్చిన 600 కోట్ల రూపాయ‌ల‌ను దారి మ‌ళ్లించార‌నే అప‌వాదు ఉంది.దీంతో అప్ప‌టి వ‌ర‌కు అంతో ఇంతో స్వావ‌లంబ‌న సాధించిన పంచాయతీలు.. ఇబ్బందుల్లో కూరుకుపోవడం ప్రారంభ‌మైంది. ఫ‌లితంగా పంచాయ‌తీ స‌భ్యులు టీ తాగేందుకు కూడా సొంత జేబులో నుంచి రూపాయి తీయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, ప‌నుల సంగ‌తి దేవుడెరుగు. మ‌రోవైపు.. స‌ర్పంచులు.. బిక్షాట‌న చేసుకున్న ప‌రిస్తితి నుంచి.. చిరు వ్యాపారాలు చేసుకుని.. ఓలా డ్రైవ‌ర్లుగా ప‌నిచేయాల్సిన ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. కొంద‌రు జొమాటోలో కూడా ప‌నిచేశారు.గ్రామ పంచాయ‌తీలు ఒక ప్ర‌మాద‌కర ప‌రిస్థితిని ఎదుర్కొన్నాయి. ఖ‌చ్చితంగా ఇంత కీల‌క స‌మయంలో పంచాయ‌తీలు పుంజుకునేలా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు న‌భూతో అనే చెప్పాలి. త‌న సొంత సొమ్ముల నుంచి రూ.4 కోట్ల‌ను పంచాయ‌తీల‌కు రూ.ల‌క్ష చొప్పున ఆయ‌న విరాళంగా అందించారు. ఇది ఒక‌ర‌కంగా.. వెంటిలేట‌ర్‌పై ఉన్న పంచాయ‌తీల‌కు ఆక్సిజ‌న్ అందించిన‌ట్టు అయింది. చ‌నిపోతున్న వ్య‌క్తికి ప్రాణం పోసిన‌ట్టుగా మారింది.ల‌క్ష రూపాయ‌లు చిన్న మొత్త‌మే అయినా.. ఇవి ఇప్పుడున్న ఒక కీల‌క సంద‌ర్భంతో పోల్చుకుంటే.. పంచాయ‌తీల‌కు ప్రాణంతో స‌మానం. అందుకే.. పంచాయ‌తీల్లో పండ‌గ నెల‌కొంది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు పంచాయ‌తీల్లో జేజేలు కొడుతున్నారు. చిన్న‌పాటి ప‌నులు చేసేందుకు.. స‌ర్పంచులు, స‌భ్యులు కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకునే అవ‌కాశం ఏర్ప‌డింది. మొత్తంగా చూస్తే.. ప‌వ‌న్‌-పంచాయ‌తీ- వితౌట్ పాలిటిక్స్ అనే మాట జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Related Posts