YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అస్సాంలో ఆన్ లైన్ స్కామ్

అస్సాంలో ఆన్ లైన్ స్కామ్

గౌహాతి, సెప్టెంబర్ 13,
అస్సాంలో ఆన్‌లైన్ స్టాక్‌ ట్రేడింగ్ కుంభకోణం తీవ్ర సంచలనంగా మారింది. పెట్టిన పెట్టుబడిని అతి త్వరలో రెట్టింపు చేస్తామని నమ్మించిన కొందరు మోసగాళ్లు.. ప్రజలను భారీగా స్టాక్‌మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తామని చెప్పి కోట్ల రూపాయలను సేకరించారు. 2నెలల్లో పెట్టిన పెట్టుబడిపై 30 శాతం లాభం వస్తుందని చెప్పి.. జనాన్ని నమ్మించారు. ఇక ఈ ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కాస్తా.. అస్సాం సినిమా ఇండస్ట్రీలోకి వ్యాపించగా.. ఓ హీరోయిన్, ఆమె భర్తతోపాటు మరికొందరి పేర్లు కూడా ఈ కేసులో బయటికి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ జరపగా.. వీరి పేర్లు బయటికి వచ్చాయి. దీంతో వారిని విచారణకు పిలిచినా రాకపోవడంతో తాజాగా అరెస్ట్ చేశారు.అస్సాం నటి సుమి బోరా, ఆమె భర్త తార్కిక్ బోరాను తాజాగా అస్సాం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న విశాల్ ఫుకాన్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే సుమి బోరా, తార్కిక్ బోరాలు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా.. వారు స్పందించలేదు. దీంతో వారిపై కోర్టు లుకౌట్ నోటీసులు జారీ చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే 60 రోజుల్లో 30 శాతం రాబడి వస్తుందని ప్రజలను నమ్మించి విశాల్ ఫుకాన్‌ కోట్ల రూపాయలను కూడబెట్టాడు. వాటితో 4 నకిలీ సంస్థలను ప్రారంభించి.. అస్సాం చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి భారీగా ఆస్తులను కూడబెట్టాడు.అస్సాంలో ఇటీవల రూ.2 వేల కోట్ల కుంభకోణాన్ని పోలీసులు గుట్టు రట్టు చేశారు. స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో భారీగా డబ్బులు సేకరించినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే అరెస్ట్‌కు ముందు సుమి బోరా ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా తన కుటుంబంపై వార్తలు వస్తుండటంతో తాను పోలీసుల ముందు లొంగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కేసులో విచారణకు తాను సహకరించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.తాను ఎక్కడికీ పారిపోలేదని.. తాము పరారీలో ఉన్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు, తమకు ఎదురైన వేధింపుల కారణంగానే తాము దూరంగా ఉన్నట్లు చెప్పారు. అయితే తాము పారిపోయామని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆ వీడియోలో చెప్పారు. ఈ వీడియో విడుదల చేసిన తర్వాతి రోజే అస్సాం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్ స్కామ్ విలువ రూ.22 వేల కోట్లు అని మొదట మీడియాలో రాగా.. ఆ తర్వాత ఆ మొత్తం రూ. 2వేల కోట్లు అని పేర్కొన్నాయి

Related Posts