YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కౌశిక్ రెడ్డిని చేర్చుకోవడంతో బీఆర్ఎస్ భ్రష్టు పట్టింది ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

కౌశిక్ రెడ్డిని చేర్చుకోవడంతో బీఆర్ఎస్ భ్రష్టు పట్టింది ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

హైదరాబాద్
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.  నాకు స్వాగతం పలికి అక్రమ కేసులు బనాయించారు. ప్రాంతీయ విభేదాలు రెచోగొట్టే పనిలో వాళ్ళు ఉన్నారు. నా ఇంటికి ఎవరు వచ్చినా స్వాగతిస్తాను. సవాల్ కు ప్రతి సవాలు విసరడం  తప్పా అని ప్రశ్నించారు. రాళ్లతో పూల కుండీలతో దడిచేయడం ఎంత వరకు మంచి పద్దతి.  పోలీసులపైనే దాడి దాడి చేసే వ్యక్తి కౌశిక్ రెడ్డి. డీపీసీ  స్థాయీ పోలీసు అధికారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డిని తెరాస పార్టీలో చేర్చుకోవడం ద్వారా అ పార్టీ బ్రష్టు పట్టిపోయిందని అన్నారు. మీడియాలో చిత్రీకరించిన వీడియోస్ ఆధారాలతో  కేసులు  పెట్టడం జరిగింది. పది సంవత్సరాలు ప్రశాంతంగా ప్రభుత్వనీ నడిపిన కేసీఆర్ ఇలాంటి చీడపురుగులను పార్టీలో  చేర్చుకోవడం ద్వారా పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లింది. ఒక చిటర్,  కోవర్టును పార్టీలో చేర్చుకొని  ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పెంచి పోషించడం ద్వారా టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందని అన్నారు.

Related Posts