రాజన్న సిరిసిల్ల
జిల్లా కేంద్రం, నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లపై పోలీసుల ఆకస్మిక దాడులు చేసారు. వారిని ముందస్తు అరెస్టుచేసి.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ తరలి వెళ్తారని ముందస్తు సమాచారంతోనే అరెస్టులని పోలీసులు అంటున్నారు. శుక్రవారం తెల్లవారుఝామున సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణిని హౌస్ అరెస్ట్ చేసారు. జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధును తంగళ్ళపల్లి మండల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.