హైదరాబాద్
ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉద్ఘాటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్, తెలంగాణలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని ఎంత మాత్రం సహించబోమన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని డిజిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసులకు సహకరించాలని, తెలంగాణ పోలీసుల ప్రతిష్టను, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని డిజిపి సూచించారు.