హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టు చేసిన బిఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా, బిఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే పై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, వారి అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలని అన్నారు.
మరోవైపు గృహ నిర్భందంలో వున్న హరీష్ రావును కలిసేందుకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకున్నారు.