హైదరాబాద్
మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసం వద్ద పోలీసులు మోహరించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తనకు డాక్టర్ వద్ద అపాయింట్ మెంట్ ఉందని పోలీసులకు తలసాని వివరించారు. పోలీసులు అడ్డుకోవడంతో తలసాని ఇంట్లోనే ఉండిపోయారు.