YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరం డయాఫ్రం దెబ్బతినడం బాధాకరం

పోలవరం డయాఫ్రం దెబ్బతినడం బాధాకరం

విజయవాడ
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులతో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు   దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం సమావేశమయ్యారు.
పురందేశ్వరి మాట్లాడుతూ దేశం లోనిఅన్ని వర్గాల ప్రజలు మేలు చేయడమే బీజేపీ విధానం. ప్రధాని మోడీ సారధ్యంలో దేశ ప్రజల సంతోషంగా ఉన్నారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డు కు మార్పులు చేర్పులు వంటి అంశాలను ధైర్యంగా మోడీ అమలు చేశారని అన్నారు.
ఎన్డీఎ ప్రభుత్వం ఎపీ అభివృద్ది కి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదు. అమరావతి రాజధాని అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉంది. 2500కోట్లు నేరుగా నిధులు కూడా గతంలో మంజూరు చేసింది. అవుటర్ రింగ్ రోడ్  నిర్మాణానికి 20వేల కోట్లు డిపిఆర్ ఓకే చేశారు. ఇంటర్నెల్స్ రోడ్ల విస్తరణకు గడ్కరీ ఆమోదం తెలిపారు. అమరావతి ఎపీ రాజధాని కాబట్టే కేంద్రం కూడా ప్రాధాన్యత ఇచ్చింది. రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం అనుకూలమైన ప్రదేశం ఇవ్వలేదు. ఆ స్థలం మార్చాలని కోరినా గత ప్రభుత్వం స్పందించలేదు.
పోలవరం విషయంలో తెలిసీ తెలియని పరిస్థితులు కొన్ని ఉత్పన్నం అయ్యయి. నిర్మాణం అయిన డయా ఫ్రం వాల్  దెబ్బ తినడం బాధాకరం. నీటి నిల్వకు ఆ ప్రాజెక్టు నిలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు డయా ఫ్రం వాల్ నిర్మాణానికి 990కోట్లు కేంద్రం ఇస్తుంది. ఏపీ అభివృద్ది కోసం బీజేపీ వేల కోట్ల నిధులు కేటాయించిందని అన్నారు.
కూటమి ప్రభుత్వం సారధ్యంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందడం ఖాయమని అన్నారు.
ఈ సమావేశంలో టీచర్స్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (అపస్) పురంధేశ్వరికి వినతి పత్రం సమర్పించారు.

Related Posts