YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆరు రోజుల దీక్షలు విజయవంతం : సీఎం చంద్రబాబు

ఆరు రోజుల దీక్షలు విజయవంతం : సీఎం చంద్రబాబు
‘మహా సంకల్పం’నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు,ప్రజా ప్రతినిధులు,అధికారులు  పాల్గోన్నారు. ఆరు రోజులు దీక్షలు విజయవంతంగా చేశారు.7వరోజు మరింత స్ఫూర్తివంతంగా చేయాలని అన్నారు. మన శక్తి,స్థాయి ‘మహాసంకల్పం’లో ప్రతిబింబించాలి. ప్రతినెలా ఇదేరోజు ‘మహా సంకల్పం’ పురోగతిని సమీక్షించాలనిఅన్నారు. ‘మహా సంకల్పం’పై నెలవారీ ప్రగతిని విశ్లేషించాలి.నాలుగేళ్లలో ఎన్నో మైలురాళ్లు అధిగమించాం. సమష్టికృషి,ప్రజా సహకారంతోనే ఇది సాధ్యం అయ్యిందని అన్నారు. ప్రతిగ్రామం పోటీబడి అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాలకు రాకపోకలు సులభతరం అయ్యాయి. ఏ ఊరువెళ్తే ఆ ఊళ్లోనే ఉండిపోవాలన్న స్ఫూర్తి నాకే వస్తోంది. గతంలో ఏ ఊళ్లో చూసినా దుమ్ము,బురద,చెత్తాచెదారం ఉండేవి. ఇప్పుడు ప్రతిఊళ్లో సిమెంట్ రోడ్లు,డ్రెయిన్లు,ఎల్ ఈడీ వీథిదీపాలు,ఓడిఎఫ్.... ప్రతి ఊళ్లో పచ్చదనం పెరిగింది. ఆహ్లాద వాతావరణం నెలకొందని అన్నారు. ‘‘మా ఇంటిపేరు ఆనందం-మా ఊరిపేరు పరిశుభ్రత’’. ఈ సంస్కృతి రాష్ట్రం మొత్తం విస్తరించాలి. సులభతరం-పౌరసేవలు(ఈజ్ ఆఫ్ డూయింగ్ సిటిజన్ సర్వీసెస్) చేశాం. మరింత సులభతరం చేయాలి అన్ని రకాల పౌరసేవలు నవ నిర్మాణ దీక్షలలో వర్షం మనవెంటే వస్తోంది. రైతులకు,వ్యవసాయానికి ఇది శుభసంకేతం.మన కృషికి ప్రకృతి కూడా కలిసివస్తోందని అన్నారు. డ్రెయినేజి వ్యవస్థ మరింత పటిష్టం కావాలి.రోడ్లపై నీరు నిలవకుండా చూడాలి. ఓడిఎఫ్ చేసినట్లే ఓడిఎఫ్ ప్లస్ కు వెళ్లాలి. పోషకాహారం అందరికీ అందుబాటులోకి రావాలి.ప్రతిఊరికి టెక్నాలజీ చేరువ చేయాలి.పౌరసేవలు మరింత సులభతరం కావాలని అన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. ప్రతిఒక్కరిలో ప్రభుత్వంపై విశ్వాసం కనిపిస్తోంది. మంచిని ప్రోత్సహించాలి.మంచికి అండగా ఉండాలి.చెడును ఖండించాలి. సంతృప్తితో పనిచేయాలి.ఆనందంగా ఉండాలి,ఆహ్లాదం నెలకొనాలి. భవిష్యత్తు ప్రగతికి ప్రతిఒక్కరూ అంకితం కావాలి. 6వరోజు దీక్షలలో 35.35లక్షల మంది పాల్గొన్నారు. ‘జన్మభూమి-మాఊరు’ను మించిన ఉత్సాహం దీక్షలలో కనిపిస్తోంది ఆరవరోజున 10,399 ప్రారంభోత్సవాలు జరిగాయి.19,475శంకుస్థాపనలు నిర్వహించారు. 84,458ఇళ్లు మంజూరుచేశారు.10,534చోట్ల సాంస్కృతిక పోటీలు జరిగాయి.10,520ప్రాంతాలలో ఆటలపోటీలు జరిపారు.8,008 ఎగ్జిబిషన్లు నిర్వహించారు. ఈ దీక్షలలో కేవలం 2,891ఫిర్యాదులే అందాయి. ఫిర్యాదులు తక్కువ రావడం పురోగతికి నిదర్శనమని అన్నారు. 

Related Posts