YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పండగలు ప్రశాంతంగా జరుపుకోవాలి

పండగలు ప్రశాంతంగా జరుపుకోవాలి

గణేష్ నిమజ్జనం మిలాద్ ఉల్ నబీ పండుగల నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమన్వయ సమావేశం నిర్వహించారు.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవ కమిటీ ప్రతినిధులు అధికారులకు, పోలీసులకు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. పండుగల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి అపశ్రుతులు తావులేకుండా ఆనందోత్సాహాల నడుమ భక్తి శ్రద్ధలతో నిమజ్జనోత్సవం మీలాద్ ఉన్ నబి వేడుకలు ను జరుపుకోవాలని కోరారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని, పరస్పర సహకారంతో గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. నిమజ్జన ఉత్సవం సాఫీగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ వేడుకల సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ మేరకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి అని అన్నారు. శాంతి కమిటీ సభ్యులు పరస్పరం సహకరించుకోవడం అభినందించ దగ్గ విషయం అన్నారు.
 ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ పరస్పర సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని, అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రపుల్ దేశయ్,  మున్సిపల్ కమిషనర్  చాహత్ బాజ్ పాయ్,ట్రైని కలెక్టర్ అజయ్ యాదవ్, డి ఆర్ డి ఓ,  పవన్ కుమార్ ఆర్డీవో మహేశ్వర్, శాంతి కమిటీ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.

Related Posts