సికింద్రాబాద్ష
సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ను పోలీసులు గృహ నిర్బంధించారు. బీ.ఆర్.ఎస్. నేత హరేశ్ రావు పిలుపుమేరకు చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో మోండా మార్కెట్ టకార బస్తీ లోని పద్మారావు గౌడ్ నివాసం వద్దకు శుక్రవారం ఉదయం పోలీసులు చేరుకొనే, వెలుపలికి వెళ్ళకుండా ఆయనను నిరోధించారు. హౌస్ అరెస్ట్ లో ఉంచారు. అదే విధంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీ.ఆర్.ఎస్. కార్పొరేటర్లు లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ (అడ్డగుట్ట), రాసురి సునితా రమేష్ (మెట్టుగూడ), సామల హేమ (సితాఫలమండీ), కంది శైలజ (బౌద్దనగర్) లను కూడా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నో వత్తిళ్ళు, శాంతీయుత ఉద్యమాలతో తెలంగాణాను సాధించిన తమకు అరెస్టులు కొత్త కాదని, ప్రభుత్వం ప్రజాస్యామ్యయుతంగా వ్యవహరించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.