‘‘నేను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లో ఉన్నా..
*కేసీఆర్‌ను కలిసేది నా వ్యక్తిగత విషయం.
*ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు’’
*జూనియర్ ఎమ్మెల్యే.. సీనియర్ సభ్యుడిని దుర్భాషలాడారన్నారు.
*మహిళలను అవమానించేలా చీర, గాజులు గురించి కౌశిక్ మాట్లాడారు
*నోరు జారింది వాస్తవమే...కౌశిక్ రెడ్డి భాషను కేసీఆర్, హరీష్ సమర్థిస్తే తాను సమర్థిస్తా
*తన భాష గురించి మాట్లాడుతోన్న హరీష్.. గతంలో ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఆయన మాటలను గుర్తుచేసుకోవాలన్నారు.
*నా ఇంటిపై జెండా ఎగుర వేయటానికి కౌశిక్ ఎవడు?
*శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
‘‘నేను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లో ఉన్నా.. కేసీఆర్‌ను కలిసేది నా వ్యక్తిగత విషయం. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు’’ అంటూ శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూన... జూనియర్ ఎమ్మెల్యే.. సీనియర్ సభ్యుడిని దుర్భాషలాడారన్నారు. తన మాట్లాడటానికి బీఆర్‌ఎస్‌లో ఎవరూ లేరా అని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డికి బీఆర్‌ఎస్ పార్టీ ఏమైనా పదవి ఇచ్చిందా? అని ప్రశ్నించారు.కౌశిక్‌రెడ్డి రౌడీయిజం చేయడం దేనికి అని నిలదీవారు. కౌశిక్‌రెడ్డి గతంలోనూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మహిళలను అవమానించేలా కౌశిక్‌రెడ్డి మాట్లాడారన్నారు. మహిళలను అవమానించేలా చీర, గాజులు గురించి కౌశిక్ మాట్లాడారని తెలిపారు. కౌశిక్‌రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చారని.. తీరు మార్చుకోవాలి అని హితవుపలికారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు కౌశిక్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శలించారు. రెచ్చగొట్టినందునే తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ‘‘కేసీఆర్ అంటే నాకు గౌరవమే. కేసీఆర్ మమ్మల్ని ఆదరించి.. ఆశీర్వదించారు. కౌశిక్‌రెడ్డి వంటి చీడపురుగులు ఉంటే బీఆర్‌ఎస్‌కు మచ్చ. కౌశిక్‌రెడ్డి తీరుతో కేసీఆర్ గతంలో చేసిన సేవలకు చెడ్డపేరు. నోరు అదుపులోలేని మనిషిని ఊరు మీదకు వదిలేశారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
నోరు జారింది వాస్తవమే...
కౌశిక్ రెడ్డి భాషను కేసీఆర్, హరీష్ సమర్థిస్తే తాను సమర్థిస్తానని తెలిపారు. తాను నోరు జారింది కూడా వాస్తవమే అని ఎమ్మెల్యే అంగీకరించారు. అక్రమ సంపాదనపై కౌశిక్ చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. కౌశిక్ వలన బీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు మచ్చ వస్తోందని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి లాంటి వారి వలనే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందన్నారు. సమాజంలో సగ భాగమున్న మహిళలను చులకన చేయటం కరెక్టేనా అని కేసీఆర్ చెప్పాలన్నారు. బ్రోకర్, కోవర్టును ఊరు మీదకు వదిలారని విమర్శించారు. అమెరికా నుంచి ఫోన్లో హెచ్చరికలు రావటంతోనే.. ఈరోజు కౌశిక్ తగ్గి మాట్లాడారన్నారు. తన భాష గురించి మాట్లాడుతోన్న హరీష్.. గతంలో ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఆయన మాటలను గుర్తుచేసుకోవాలన్నారు.‘‘నా ఇంటిపై జెండా ఎగుర వేయటానికి కౌశిన్ ఎవడు? ప్రభుత్వాన్ని డిస్ట్రబ్ చేయటానికే కౌశిక్ రెడ్డి ప్రయత్నాలు. నాపై కౌశిక్ రౌడీయిజం చేయాల్సిన అవసరం ఏంటి? కౌశిక్ గత చరిత్ర హీనం. మహిళా గవర్నర్‌ను అవమానించిన చరిత్ర కౌశిక్ ది. చీర, గాజుల గురించి మాట్లాడి తల్లి, చెల్లి, భార్యను అవమానించాడు. ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి ఇప్పుడు తప్పించుకుంటున్నాడు. కౌశిక్ మాటలతో ఆంధ్ర వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. కౌశిక్ రెచ్చగొట్టినందుకే నేను స్పందించాల్సి వచ్చింది. ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీచేయటం వలనే కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌లో గెలిచాడు’’ అంటూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు.