హైదరాబాద్
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు విరాళం అందించారు. బాలకృష్ణ తరపున వారి కూతురు తేజస్విని సచివాలయంలో సీఎం రేవంత్ ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు.