YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఆర్టీసీ నేతలతో మంత్రి భేటీ

ఆర్టీసీ నేతలతో మంత్రి భేటీ
ఆర్టీసీ కార్మికులతో మంత్రి మహేందర్ రెడ్డి ముగిశాయి. సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపింది. మంత్రి మహేందర్ రెడ్డితో ఆర్టీసీ కార్మికులు జరిపిన చర్చలు ముగిశాయి. సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మకులను కోరింది. అయితే సమ్మె విషయంపై రేపు మధ్యాహ్నం తమ నిర్ణయం చెబుతామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వానికి చెప్పారు. ఈ  ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఎండీ రమణారావు, కార్మిక సంఘాల నేతలు రాజీరెడ్డి(ఈయూ),హన్మంతు  (టీజేఎంయూ),వీఎస్ రావు( ఎస్ డబ్ల్యూ), అబ్రహాం( ఐఎన్ టీయూసీ), రమేష్ కుమార్  (బీఎంఎస్), యాదయ్య.బీ( టీఎన్ టీయూసీ), ఎస్. సురేష్  (బీడ్బ్లూఎల్ ), యాదగిరి  (బీకేయూ) లు పాల్గోన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నష్టాలు,కష్టాల ఆర్టీసీ ని సమిష్టి కృషితో ముందడుగు వేయిద్దాం. సమ్మె మీద పునరాలోచించుకుని, విరమించుకోండి. సీఎం కేసీఆర్ తో చర్చించి త్వరలో  ప్రత్యేక కమిటీ వేసుకుని ఇతర రాష్ట్రాలలో ఉన్న పరిస్థితి ని అధ్యయనం చేసుకుని ముందడుగు వేద్దామని సూచించారు. అక్రమ రవాణా మీద ఎప్పుడూ సీరియస్ గా ఉన్నాం, గతంలో ఎన్నడూలేని విధంగా నాలుగేళ్ళ లో అక్రమ రవాణా మీద కేసులు నమోదు చేశామని అయన అన్నారు.  చర్చలు ముగిసిన అనంతరం సంఘం నేతలు  మాట్లాడుతూ సమ్మె నోటీస్‌పై చర్చ జరిగిందని, సమ్మెను వాయిదా వేయాలని మంత్రి కోరారన్నారు. తమకు నిర్ధిష్టమైన హామీ మంత్రి వర్గం నుంచి గానీ, ముఖ్యమంత్రి గానీ ఇవ్వాలని అడిగామని, అందుకు ఎలాంటి హామీ ఇవ్వలేదని, ముందు సమ్మెను వాయిదా వేయాలని, తర్వాత మాట్లాడతామని మంత్రి అన్నారని నేతలు తెలిపారు. అన్ని సంఘాలతో మాట్లాడి శనివారం నిర్ణయం తెలుపుతామని చెప్పినట్లు వారు తెలిపారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు సకాలంలో ఇస్తే నష్టాలు రావన్నారు.యూనియన్‌ ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తున్నామనడం సరికాదని నేతలు అన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల అగౌరవంగా మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్‌ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ రాజిరెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని, డీజిల్ ధరల పెరుగుదల భారాన్ని ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా రేపు ఆర్టీసీ డిపోల ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతామని ఆర్టీసీ జేఏసీ నేత వీఎస్‌రావు అన్నారు.

Related Posts