YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్

హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16,
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ విసిరిన క్రేజీ ఛాలెంజ్.. ఢిల్లీ రాజకీయాల్ని హీటెక్కించింది. మద్యం పాలసీ కేసులో అరెస్టయి శనివారమే బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్.. సంచలన ప్రకటన చేశారు. రెండురోజుల్లో రాజీనామా చేస్తా.. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటా.. ప్రజాక్షేత్రంలో పోరాడి.. కడిగిన ముత్యంలా బైటికొచ్చాకే మళ్లీ ముఖ్యమంత్రి అవుతా.. అరవింద్ కేజ్రివాల్ విసిరిన ఓపెన్ ఛాలెంజ్ ఇది.ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్‌ చెప్పగానే, వద్దువద్దంటూ నినాదాలు చేశారు ఆమ్‌ఆద్మీ కార్యకర్తలు. కానీ.. దోషిగా పడ్డ మరకను తుడిచేసుకోవాలి.. నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు ఈ పదవి నాకొద్దు అన్నారు కేజ్రివాల్. నేను అవినీతికి పాల్పడలేదని వాళ్లకూ తెలుసు.. నా పార్టీని చీల్చి, సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే వాళ్ల కుట్ర అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు కేజ్రివాల్.ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ నిర్ణయంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రావడానికి ముందే తాను నిరాకరించానని అన్నారు. ‘రాజకీయాల్లోకి వెళ్లోద్దని.. సమాజానికి సేవ చేయాలని, దాంతో గొప్ప వ్యక్తి అవుతారని సూచించినట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇద్దరం కలిసి ఉన్నామని, రాజకీయాల్లోకి రావద్దని..సామాజిక సేవా కార్యక్రమాలతోనే ప్రజల్లో ఉండాలంటూ పదే పదే చెప్పానన్నారు. గతంలో సంతోషం వ్యక్తం చేసిన ఆయన, ఆ తర్వా అతని హృదయంలో ఉన్నది ఇప్పుడు లేదన్నారు.ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో శుక్రవారం తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్, మరికొద్ది రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సమావేశం ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యేలను, పార్టీకి చెందిన ఓ నేతను ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరగాల్సి ఉందని, అయితే నవంబర్‌లో మహారాష్ట్రతో పాటు దేశ రాజధానికి కూడా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు కేజ్రీవాల్.ప్రజలు నాకు నిజాయితీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుంటానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత అగ్నిపరీక్ష ఇవ్వాలనుకుంటున్నానన్నారు. నిజాయితీపరులమని ప్రజలు చెప్పినప్పుడే ముఖ్యమంత్రిని అవుతానని, సిసోడియా ఉప ముఖ్యమంత్రి అవుతారని కూడా ఆయన అన్నారు.అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారికంగా సంతకాలు చేయకూడదంటూ బెయిల్‌ షరతుల్లో పేర్కొంది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో తాను సిగ్నేచర్ పవర్ లేని సీఎంగా ఎలా ఉంటారంటూ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అధికారాల్లేని ముఖ్యమంత్రిగా ఉండడం కంటే తప్పుకోవడమే బెటరని కేజ్రివాల్ నిర్ణయించుకున్నారు. దాని ఫలితమే ఈ సంచలన ప్రకటన.ఇక షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ.. ఈ ఏడాది నవంబర్‌ నెలలోగానే మహారాష్ట్ర అసెంబ్లీతోపాటే డిల్లీ అసెంబ్లీకీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు సీఎం కేజ్రీవాల్. అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేస్తే.. ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి.

Related Posts