YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ముందే రికార్డ్ బద్దలు కొడుతున్న దేవర

ముందే రికార్డ్ బద్దలు కొడుతున్న దేవర

హైదరాబాద్, సెప్టెంబర్ 16,
దేవర'తో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన బైరా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆయన ఎంపిక వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అయితే... మరొకరు ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ. 'ఓంకార'లో సైఫ్ నటన తనకు ఇష్టమని, తాను - శివ (కొరటాల) సంయుక్తంగా సైఫ్ అలీ ఖాన్ అయితే బైరా పాత్రకు పర్ఫెక్ట్ అని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక... ఈ సినిమా గురించి సైఫ్ అలీ ఖాన్ చెప్పిన మాటలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.'దేవర' ను హాలీవుడ్ సినిమా 'అపోక్లిప్టో'తో కంపేర్ చేశారు సైఫ్ అలీ ఖాన్. కొరటాల శివ క్రియేట్ చేసిన ప్రపంచం ఆ తరహాలో ఉంటుందని, ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అవుతారని చెప్పుకొచ్చారు. దీనిని ఒక ట్రైబల్ పైరేట్స్ కథగా మనం చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. దాంతో ఆడియన్స్ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.తనను శారీరకంగా, మానసికంగా ఎక్కువ కష్టపెట్టిన సినిమాల్లో 'దేవర' కూడా ఒకటి అని సైఫ్ అలీ ఖాన్ తెలిపారు. ఈ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం తాము 10 రోజులు షూటింగ్ చేశామని వివరించారు. కేవలం రాత్రి వేళల్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సీలు తీశామని చెప్పుకొచ్చారు. ప్రజల మధ్య పహిల్వాన్ తరహాలో జరిగే పోటీ అందులో భాగమని అర్థం అవుతోంది. ఆ యాక్షన్ సీక్వెన్సులో కొంత అవుట్ డోర్ ఉన్నప్పటికీ... అది కాకుండా కేవలం ఇండోర్ షూట్ కోసం పది రోజులు స్పెండ్ చేశామని ఆయన అన్నారు.తెలుగులో తనకు 'దేవర' తొలి సినిమా కనుక డైలాగుల విషయంలో మొదట కొంత కంగారు పడ్డానని, అయితే దర్శకుడు కొరటాల శివ ఆ విషయంలో పెద్దగా టెన్షన్ తీసుకోవద్దని చెప్పడంతో తొలుత చిత్రీకరణలో పెద్దగా ఇబ్బంది కాలేదని సైఫ్ అలీ ఖాన్ చెప్పారు. ''నేను డైలాగులు చెప్పడంతో కొరటాల శివ తర్వాత పెంచారు. ఓ రోజు అసిస్టెంట్ వచ్చి డైలాగ్స్ ఇచ్చాడు. రెండు పేజీలు ఉన్నాయి'' అని సైఫ్ అలీ ఖాన్ సరదాగా చెప్పారు. 'దేవర' సినిమా, అందులో తన క్యారెక్టర్ గురించి చెప్పిన సైఫ్ అలీ ఖాన్... ఆయన క్యారెక్టర్ మొదటి పార్టులో మరణిస్తుందా? లేదంటే రెండో పార్టులో ఉంటుందా? అని సందీప్ రెడ్డి వంగా అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. ఆ విషయం సెప్టెంబర్ 27న తెలుస్తుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Related Posts