YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రిజిస్ట్రార్ ఆఫీసులో రాచరికపు విలువకు స్వస్తి

రిజిస్ట్రార్ ఆఫీసులో రాచరికపు విలువకు స్వస్తి

ఒంగోలు, సెప్టెంబర్ 18,
ఏపీలో కూటమి సర్కార్ మరో మార్పునకు సిద్ధమైంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో...కోర్టు జడ్జిల మాదిరిగా ఎత్తైన కుర్చీల్లో కూర్చోవడం, ప్రజలు వారి ముందు గంటల తరబడి నిలబడడం ఉండేవి. ఇలాంటి రాచరికపు విధానాలకు స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మార్పులపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా, మంత్రి సత్య ప్రసాద్ ప్రతిపాదనలు చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి తాము గమనించిన విధానాలు, తీసుకురావాల్సిన మార్పులపై ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ మార్పులపై సర్య్కులర్ జారీ అయ్యింది.ఇతర ప్రభుత్వ కార్యాలయాల తరహాలోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఉండాలని, సీటింగ్ విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. సబ్ రిజిస్ట్రార్లు కూడా సామాన్యులే అనే భావన ప్రజలకు కలిగించేలా రెవెన్యూ శాఖ మార్పులు చేపట్టింది. సబ్ రిజిస్ట్రార్‌ కూర్చొనే ఎత్తైన పోడియం, చుట్టూ ఉన్న రెడ్ క్లాత్ ను తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కుర్చీ కూడా ఫ్లోర్ హైట్‌లో ఉండాలని, వారి చుట్టూ ఎలాంటి అడ్డు ఉండకూడదని శాఖాపరమైన ఉత్తర్వులు జారీ చేశారు. భూముల రిజిస్ట్రేషన్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని అందించే ప్రజలకు... రిజిస్ట్రేషన్ ఆఫీసులో అత్యధిక గౌరవం ఉండాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ప్రజలు నిలబడి ఉండే విధానానికి స్వస్తి పలకాలని అధికారులు ఆదేశించారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సమయం పడితే వారికి మంచినీళ్లు, టీ ఇచ్చి గౌరవించాలని సర్క్యులర్ జారీ చేశారు.సబ్‌రిజిస్ట్రార్ల కూర్చునే కుర్చీ ఫ్లోర్ లెవల్ లో ఉండడంతో పాటు, వారి ముందుండే పోడియంను తొలగించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీచేసింది. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన ప్రజలు వారి కంటే ఎత్తులో ఉన్న సబ్‌రిజిస్ట్రార్ పోడియం ముందు గంటల తరబడి నిలబడి రిజిస్ట్రేషన్‌ కోసం వేచిచూసే పరిస్థితులు ఉన్నాయి. ఈ విధానం ప్రజలను అవమానపరిచేలా ఉందని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అంతరం పెంచేలా ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. భూముల రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూరుస్తున్న ప్రజలకు తగిన గౌరవం ఇవ్వాలని పేర్కొంటూ శనివారం రెవెన్యూ శాఖ మెమో జారీ చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే సబ్‌ రిజిస్ట్రార్ ముందున్న చెక్క, ఎర్రని క్లాత్ ఉన్న పోడియాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కుర్చీ సాధారణ ఫ్లోరింగ్ పైనే ఉండాలని, వారి ముందు ప్రజలకు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు అందుబాటులో ఉంచాలన్నారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారు కూర్చుని రిజిస్ట్రేషన్‌ చేసేకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సబ్‌రిజిస్ట్రార్‌, ప్రజలకు మధ్య టేబుల్‌ తప్ప మరేమీ అడ్డంగా ఉండకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Related Posts