నాని గాడి రాసలీలలు అన్నీ బయటపెడతా.. కాసుకోరా నాని.. నీ కాపురంలో నిప్పులే’ అంటూ సెన్సేషనల్ కామెంట్ చేసింది శ్రీరెడ్డి. గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీపైన, పవన్ కళ్యాణ్‌పైన, నానిపైన నోరుపారేసుకుంటున్న శ్రీరెడ్డి మరోసారి నానిని టార్గెట్ చేసింది. మరోరెండు రోజుల్లో నాని హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 2’ ప్రసారం కాబోతుండటంతో.. ఈ షోలో కన్టెస్టెంట్‌గా శ్రీరెడ్డి ఉండబోతుందంటూ ప్రచారం నడుస్తోంది. అయితే ఇది ఈ విషయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్టార్ మా సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాని.. బిగ్ బాస్‌లో శ్రీరెడ్డి అనే ప్రచారాన్ని బాగా వాడేసుకుంటుంది ఈ వివాదాస్పద నటి. బిగ్‌బాస్ షోలో శ్రీరెడ్డి పార్టిసిపేట్ చేస్తుందా? అన్న విషయంపై క్లారిటీ ఇవ్వకుండా.. ‘నాని నేను కలిస్తే.. డర్టీ పిక్చరే’.. అతి త్వరలో ఆన్ ద వే’ అంటూనే.. నాని గాడి రాసలీలు అన్నీ బయటపెడతా.. కాసుకోండి నాని నీ కాపురంలో నిప్పులే’ అంటూ ట్వీట్ చేసింది. తాజా ఫేస్ బుక్‌లో లైవ్‌లో కూడా అందరూ బిగ్ బాస్ హౌస్‌కి వస్తున్నారా? అని పదే పదే అడగడంతో తనకు వస్తున్న పబ్లిసిటీని ఎందుకు కాదనుకోవాలి అనుకుందో ఏమో కాని.. డొంకతిరుగుడు సమాధానాలే చెప్పింది. ఒకసారి మెగా ఫ్యామిలీ ప్రభావం బిగ్‌బాస్‌పై బాగా పనిచేస్తుందని.. తనను బిగ్ బాస్‌కి రాకుండా అడ్డుకుంటున్నారని.. మరోసారి బిజీగా ఉండటం వల్ల నేనే బిగ్ బాస్ ఆఫర్‌ని రిజెక్ట్ చేశా అంటూ మాటలు మారుస్తూ వస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న ‘బిగ్‌బాస్’ రియాలిటి షో ప్రమోషన్స్‌లో నాని బిజీగా ఉంటే అతడ్ని టార్గెట్ చేస్తూ.. నేను నీ కాపురంలో నిప్పులు పోస్తా.. మంట పెడతా అంటూ మంగమ్మ శపథాలు ఏంటి? అంటూ నెటిజన్లు శ్రీరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. ఏదైనా ఉంటే ఆధారాలతో నిరూపించాలే తప్ప నోటికొచ్చినట్లు ఈ వాగుడు ఏంటో అర్ధంకాని పరిస్థితి. ఉదయం లేస్తే... పవన్‌ని తిట్టడం.. లోకేష్, జగన్‌లను అన్నలూ అంటూ తెగ పొగిడేయడం ఇదే దినచర్య మార్చుకుంది శ్రీరెడ్డి.