తిరుపతి, సెప్టెంబర్ 19,
చిత్తూరు జిల్లా పాలిటిక్స్ లో పెద్దాయనగా పుంగనూరులో పెద్దిరెడ్డికి ఇంపార్టెన్స్ ఉన్నా.. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి తిరుగులేని పుంగనూరులో ఇప్పుడు పర్యటించాలంటేనే పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పెద్దిరెడ్డితో పాటు, తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇలా ముగ్గురూ ఫ్యామిలీ మెంబెర్స్ గెలిచినా ఆ ఫ్యామిలీకి ఇప్పుడు అక్కడ చుక్కెదురవుతోంది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పుంగనూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ పర్యటించాలంటే భారీ పోలీసు బందుబస్తు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నా ఆ నియోజకవర్గంలో వారి పర్యటన సాఫీగా సాగని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గాల పునర్విభజన అంశం పుంగనూరు పాలిటిక్స్ లో కొత్త అంశాన్ని తెరమీదికి తెచ్చింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలం సదుం జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో పుంగనూరు నుంచి విడిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పెద్దిరెడ్డి ఇక పుంగనూరుకు దూరం అవుతారంటూ చర్చ నడుస్తోంది. పెద్దిరెడ్డి వర్గంపై ప్రభావం చూపేలా జరుగుతున్న ఈ ప్రచారం వైసీపీ కేడర్ లో గందరగోళానికి కారణం అయ్యింది. ఈ నేపథ్యంలోనే పుంగనూరులో పర్యటించడమే పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఇబ్బందికరంగా మారడం, పుంగనూరుకు ప్రస్తుతం పెద్దిరెడ్డి కూడా దూరంగా ఉండటం కేడర్ కు ఇబ్బందిగా మారింది. దీంతో ప్రచారం వాస్తవమని క్యాడర్ నమ్ముతున్న పరిస్థితుల్లో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటన, చేస్తున్న కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి..భారీ భద్రత మధ్య పుంగనూరు నియోజకవర్గంలో రోజుకో మండలాన్ని చుట్టేస్తున్న ఎంపీ మిథున్ పుంగనూరు కన్నతల్లి లాంటిదని, పుంగనూరును వదిలి వెళ్ళమని కేడర్ కు హామీ ఇస్తూ వస్తున్నారు. పుకార్లను నమ్మొద్దని, పునర్విభజన జరిగితే పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తానంటూ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇలా ఎంపీ ఇస్తున్న భరోసా ఇప్పుడు పుంగనూరు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.2009 నుంచి వరుసగా గెలుస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పుంగనూరును నిజంగానే వీడుతారా..? రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న పుంగనూరు నుంచి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న పెద్దిరెడ్డి మిథున్ వారసుడిగా పుంగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..? లేదంటే పెద్దిరెడ్డి వారసుడిగా మరొకరు బరిలో ఉంటారా..? అన్నదే హాట్ టాపిక్ అయింది. సొంత మండలం సదుం పుంగనూరు నుంచి విడిపోయినా తిరిగి పెద్దిరెడ్డినే పుంగనూరు నుంచి పోటీ చేస్తారా..? అన్న దానిపై స్పష్టత లేకపోగా పునర్విభజన అంశం మాత్రం పుంగనూరు పాలిటిక్స్ లో ఆసక్తికర రాజకీయ అంశంగా మారిపోయింది.