విశాఖజిల్లా పాయకరావుపేట లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈనెల 5వతేదీన పవన్ కళ్యాణ్ ప్లెక్లీలుకడుతూ మృతిచెందిన భీమవరపు శివ కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ శివ భార్యను ఓదార్చి, 3లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. శివ కుమారుడు మూడునెలల బాబుకు అనిరుద్ అనే పేరు నామకరణం చేసారు. అనిరుద్ అని పేరుపెట్టి పవన్ బాలుడిని ఒడిలోకీ తీసుకుని ముద్దాడ్డారు. తరువాత అభిమానులనుద్దేశించి పవన్ మాట్లాడారు. నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ లేకపోతే ఎలా చదువుకుంటారు , ఎలా ఉద్యోగాలు వస్తాయి. గురజాడ అప్పారావు పుట్టిన ప్రాంతంలో అక్షరాస్యత శాతం ఇక్కడ తక్కువగా ఉండడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. 2014 లో పోటీ చేయకుండా టిడిపికీ మద్దతిస్తే బలమైన పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ది జరుగుతుందనుకున్నాను. కానీ ప్రభుత్వ ఆయకరావుపేట నియోజక వర్గిన్ని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. 2019 లో పాయకరావుపేట అసెంబ్లీ జనసేనదే. యువతకీ ఉపాధి కల్పించడంలో జనసేన మీకు అండగా ఉంటుంది. ఇక్కడ ఇసుక మాఫియా రాజ్యమేలుతుంది. అధికార ప్రభుత్వానికి కబ్జాలే ధ్యేయంగా నడుస్తుంది. పిసిపిఐఆర్ పేరుతో స్థానిక కంపెనీలలో స్థానికులకు ఉపాధి కల్పించడంలేదు. నీటి సదుపాయాలు, సాగునీటి అవకాశాలు కల్పించడంలేదు. నిరుద్యోగ భృతి లోకేష్ కి మాత్రమే అందుతున్నదని అన్నారు. చంద్రబాబుకి సూటిగా చెబుతున్నా ,పవన్ కళ్యాణ్ ఎందుకు ఎదురు తిరిగాడంటే స్పెషల్ స్టెటస్ పై మాట ఎందుకు మార్చారని అన్నారు. అభివృద్ది అంటే అమరావతి ఒక్కటే కాదని ,పాయకరావుపేటలో కూడా అభివృద్ది అవసరమనిఅయనఅన్నారు.