YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దసరా తర్వాత సెకండ్ లిస్ట్..

దసరా తర్వాత సెకండ్ లిస్ట్..

విజయవాడ, సెప్టెంబర్ 26,
నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి తొలి అడుగు పడింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లతో కలిపి 99 మందికి ఫస్ట్‌ బొనంజా ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇందులో జనసేనకు మూడు, బీజేపీకి ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కేటాయించారు.ఐతే తొలి విడత జాబితాలో ఉంటారనుకున్న కొందరు ఆశావహులు పేర్లు మాత్రం కనిపించలేదు. ఎన్నికల్లో ఫస్ట్‌ మీకే ప్రాధాన్యమని అధినేత హామీ ఇచ్చిన ఆ నేతలు నెక్ట్స్‌ లిస్టుకు ఎందుకు షిప్ట్‌ అయ్యారు? తొలి జాబితాలో కూడికలు తీసివేతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…..ఏపీలో పదవుల పందేరానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 20 కార్పొరేషన్లు, వాటి డైరెక్టర్లు కలిపి మొత్తం 99 మందికి ఫస్ట్‌ లిస్టులో పదవులు కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. ఇందులో ముగ్గురు త్యాగరాజులుతోపాటు యువనేత లోకేశ్‌ పాదయాత్ర, ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరిలో గట్టిగా పనిచేసిన నేతలకు ప్రాధాన్యం దక్కిందని చెబుతున్నారు.అదేవిధంగా గత ఎన్నికల్లో పార్టీ విజయానికి పాటుపడిన దామచర్ల సత్య వంటివారికి అగ్రతాంబూళమే దక్కిందని చెబుతున్నారు. ఇక సీనియర్లకు అవకాశం కల్పిస్తూనే జూనియర్లను ప్రోత్సహించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కూటమిలో సమన్వయం కమిటీ నిర్ణయానికి తగ్గట్లు 20 మందితో ప్రకటించిన తొలిజాబితాలో జనసేన, బీజేపీ నేతలకు పదవులు దక్కాయి. ఐతే బీజేపీ కోటాలో పదవి దక్కించుకున్న లంకా దినకర్‌కు గతంలో టీడీపీతో అనుబంధం ఉండటం చర్చకు తావిస్తోంది. ఇక జనసేనకు కేటాయించిన మూడు చైర్మన్‌ పదవులు కీలకమైనవేనని చెబుతున్నారు.పట్టణాభివృద్ధి, చిన్న పరిశ్రమలు, పౌర సరఫరాలు వంటి ముఖ్యమైన కార్పొరేషన్లు జనసేన దక్కించుకుంది. ఆ పార్టీకి కేటాయించిన మూడు కార్పొరేషన్లలో ఒకటైన పౌర సరఫరాల కార్పొరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్‌ పర్యవేక్షణలో ఉండటం విశేషం. ఇక తొలి జాబితా తర్వాత మరిన్ని పదవుల ప్రకటన త్వరలోనే ఉంటుందని, దసరాలోగా రెండో విడత పదవుల భర్తీ ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.వాస్తవానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో చాలా మంది నేతలు నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఇందులో గత ఎన్నికల్లో సీట్లు కోల్పోయిన 31 మంది టీడీపీ నేతలకు ప్రాధాన్యం ఉంటుందని భావించారు. ముఖ్యంగా పిఠాపురం సీటు వదలుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ, మైలవరం సీటును త్యాగం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు తొలి అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగింది. అదేవిధంగా టీటీడీ పాలకవర్గం నియామకం కూడా ముందు ఉంటుందని చెప్పారు. కానీ, తొలి జాబితాలో మాజీ మంత్రి దేవినేని ఉమాతోపాటు మాజీ ఎమ్మెల్యే వర్మకు అవకాశం దక్కలేదు. ఇక టీటీడీ బోర్డుపైనా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.తొలి జాబితాలో కార్పొరేషన్ చైర్మన్‌ పదవి దక్కని నేతలకు రెండో జాబితాలో అవకాశమిస్తారా? లేక మరేదైనా ప్రత్యామ్నాయం చూపుతారా? అనే చర్చ ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి ఉమా, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, ఆలపాటి రాజా వంటివారు నామినేటెడ్‌ రేసులో ముందున్నారని వినిపించినా, లిస్టులో వారి పేర్లు లేకపోవడంతో పార్టీ శ్రేణులు అవాక్కయ్యాయి.పైగా మాజీ మంత్రి ఉమాకు కేటాయిస్తారని ప్రచారం జరిగిన ఆర్టీసీ చైర్మన్‌ పదవిని సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు కట్టబెట్టారు. దీంతో ఉమాకు ఎలాంటి ప్రాధాన్యమిస్తారనేదే పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో సీట్లు త్యాగం చేసిన వారిలో కర్రోతు బంగార్రాజు, పీలా గోవింద సత్యనారాయణ, మంతెన రామరాజులకు ప్రాధాన్యం దక్కడం విశేషంగా చెబుతున్నారు.మొత్తానికి తొలి జాబితా విడుదలైనా… ఆశావహులను మాత్రం సంతృప్త పరచలేకపోయిందనే కామెంట్లే వినిపిస్తున్నాయి. మొదటి జాబితాలో కీలకమైన కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించినప్పటికీ.. ఎవరూ ఊహించని నేతలు పదవులు దక్కించుకోవడమే కూటమిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పదవులు దక్కించుకున్న 16 మందిలో టీం లోకేశ్‌లో సభ్యులు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏదిఏమైనా పదవుల భర్తీ జాతర మొదలు కావడంతో కూటమి పార్టీల్లో సందడి కనిపిస్తోంది.

Related Posts