- చూసి ఆనందించండి .. బిర్లా సెంటర్ డైరెక్టర్
ఈ నెల 31న సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని అందరూ చూసి ఆనందించాలని బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సిద్ధార్థ్ సూచించారు. గ్రహణాన్ని చూస్తే అరిష్టమని, జబ్బులు వస్తాయన్నది అపోహేనని అన్నారు. శనివారం నగరంలోని బిర్లా సైన్స్ సెంటర్‌లో విలేకరుల సమావేశంలో సిద్ధార్థ్ మాట్లాడారు. 150 ఏళ్ల క్రితం వచ్చిన బ్లూమూన్ మరలా ఇప్పుడు వస్తోందని, దానిని చూడకూడదనడం అపోహేనని అన్నారు. ఒక నెలలో రెండు పౌర్ణమిలు వస్తే రెండో పౌర్ణమిని బ్లూమూన్ అంటామని తెలిపారు. ఇలా మూడు, నాలుగేళ్లకు ఓసారి జరుగుతుందన్నారు. దీని వల్ల చంద్రుడి రంగు మారనప్పటికీ గ్రహణం మాత్రం ఏర్పడుతుందని చెప్పారు. ఈ నెల 31న సాయంత్రం సుమారు 6.35 గంటలకు గ్రహణం ప్రారంభమై గంటపాటు ఉంటుందని సిద్ధార్థ్ తెలిపారు.