YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీపై కాంగ్రెస్ ఛార్జీ షీట్

టీడీపీపై కాంగ్రెస్ ఛార్జీ షీట్
ఏపీలో దూకుడు పెంచింది కాంగ్రెస్. వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావడంతో.. దగా పాలనపై ఛార్జ్‌షీట్ పేరుతో ఆందోళనా కార్యక్రమాలను ఉధృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టింది. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటూ పార్టీ నేతలు పాల్గొన్నారు. నాలుగేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజలకు కరపత్రాలను పంచారు.. అనంతరం భారీ ర్యాలీని కూడా చేపట్టారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ' నాలుగేళ్ల పాలనపై కాంగ్రెస్ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై చర్చకు సిద్ధమా. డ్వాక్రా మహిళల రుణమాఫీ, కాపులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. దుగరాపట్నం పోర్ట్, విశాఖకు రైల్వే జోన్‌లు మాటేంటి. విభజన హామీలను సాధించడంలో కూడా విఫలం. నాలుగేళ్లుగా అవినీతి పెరిగిపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుకను దోచుకుంటున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్టును ఆలస్యం చేస్తున్నారు' అని ఆరోపించారు.

Related Posts