YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రమణారెడ్డి... సొంత మ్యానిఫెస్టో తో ఇబ్బందులు

రమణారెడ్డి... సొంత మ్యానిఫెస్టో తో ఇబ్బందులు

నిజామాబాద్, సెప్టెంబర్ 26,
ఆ నేత గెలుపు గత ఎన్నికల్లో సంచలనం. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించి.. రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ మేనిఫెస్టోతో సంబంధం లేకుండా సొంత స్కీమ్స్‌ ప్రకటించేశారా ఎమ్మెల్యే. 150 కోట్లు ఖర్చయినా సరే సొంత ఆస్తుల్ని అమ్మి అయినా.. నియోజకవర్గాన్ని నందనవనం చేస్తానని చెప్పారు. మరి, హామీలు అమలు చేశారా? ఆ దిశగా అడుగులు పడ్డాయా? త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే ఓన్ మ్యానిఫెస్టో  ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనుందా?
బీజేపీ నేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. గత ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు రమణారెడ్డి. కానీ గత ఎన్నికల్లో మాత్రం ఇద్దరు ఉద్దండులను కాదని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆయనకు తొలిసారి అవకాశం ఇచ్చారు.కాటిపల్లిని ఎమ్మెల్యేగా గెలిపించడం వెనుక.. ఓ కారణం ఉందంటున్నారట నియోజకవర్గ ప్రజలు. ఎన్నికల వేళ ఏ ఎమ్మెల్యే అభ్యర్ధి చేయని సాహసం చేశారట రమణారెడ్డి. నన్ను చూసి ఓటెయ్యండి, నా పథకాల్ని చూడండి అంటూ 150 కోట్లతో సొంత మ్యానిఫెస్టో ప్రకటించారట. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా 150 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తానని హామీ ఇచ్చారట. ప్రజలు సైతం ఆయన మాటలను నమ్మి గెలిపించారు. అయితే ఇప్పుడు 6 నెలల్లో హామీలను అమలు చేస్తానన్న ఎమ్మెల్యే.. 9 నెలలు గడిచిన ఏమి పట్టనట్టు సైలెంట్ గా ఉండడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ.. ఇప్పుడేమయ్యాయని ప్రశ్నలు సైతం వస్తున్నాయి. నియోజకవర్గం మొత్తం ఉచిత కార్పొరేట్ విద్య, వైద్యం.. ఉచిత శిక్షణ కేంద్రాలు, రైతులకు కల్లాల నిర్మాణం, క్రీడా ప్రాంగణాలు.. జనరల్ ఆసుపత్రులను నిర్మిస్తానని ఎన్నికల హామీలు ఇచ్చారట కాటిపల్లి. 150 కోట్ల రూపాయల సొంత నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారట. తీరా ఇప్పుడు గడిచి ఇన్ని నెలలు అవుతుండడంతో.. ఇంత కాలం ఓపిక పట్టిన ప్రజలు.. ఇప్పుడు ఆ హామీలు సంగతేంటని ప్రశ్నించడానికి రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది.ఈ పరిస్థితుల్లో సొంత పార్టీ క్యాడర్ సైతం.. కాటిపల్లి ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యమేనా అని చర్చించుకుంటున్నారట. నాడు ప్రభుత్వాలు చేసేదేంటి నన్ను గెలిపించండి.. అన్ని నేను చేసి చూపిస్తానన్న ఎమ్మెల్యే.. ఇప్పుడు మిన్నకుండడం పట్ల బీజేపీ నేతలు సైతం అయోమయంలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు రానున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో.. 150 కోట్ల మ్యానిఫెస్టోపై ప్రజల నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని తర్జనభర్జన పడుతున్నారట.గత అసెంబ్లీ ఎన్నికల్లో రమణారెడ్డి సొంత మ్యానిఫెస్టో బుక్ లెట్ ను విడుదల చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అదే బుక్ లెట్ తో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రభుత్వం పై కాటిపల్లి విమర్శలు చేస్తే.. సెల్ఫ్ మ్యానిఫెస్టోను అంశంపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఆస్తులు అమ్మైనా మ్యానిఫెస్టోను అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ఏం చేశారని అధికార పక్షం సైతం నిలదీస్తారని మౌనం వహిస్తున్నారట.త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలను వేదికగా చేసుకుని బీజేపీని నిలదీయాలని.. కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజలు సైతం సమాయత్తం అవుతున్నారని నియోజకవర్గం వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే కాటిపల్లిని ప్రశ్నించేందుకు రైతులు, విద్యార్థులు, యువత, ప్రజలు సిద్ధమవుతున్నారట. దీనిపై కాటిపల్లి, బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారో అనేది సస్పెన్స్ గా మారింది.అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి చేసిన కామెంట్లతో కామారెడ్డి ప్రజలు అవాక్కవుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అనిపిస్తుందని .. రమణారెడ్డి వైరాగ్యంతో మాట్లాడడం పట్ల ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని నమ్మి.. ఎమ్మెల్యే పదవి కట్టబెడితే ఇలా మాట్లాడడం ఏంటని షాక్ అవుతున్నారట.మొత్తానికి సెల్ఫ్ మ్యానిఫెస్టోతో గ్రాండ్ విక్టరీ కొట్టిన కాటిపల్లి.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా ? ఎమ్మెల్యే మౌనం రానున్న ఎన్నికల్లో బీజేపీకి కష్టాలు తెచ్చిపెడుతుందా ? ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ప్రజలు భగ్గుమనే టైం దగ్గర పడిందా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Related Posts