YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నార్సింగి స్టేషన్...కేరాఫ్ వీఐపీ కేసులు

నార్సింగి స్టేషన్...కేరాఫ్ వీఐపీ కేసులు

హైదరాబాద్, సెప్టెంబర్ 26,
నార్సింగి ఠాణా లవ్‌ బ్రేకప్‌ ఇష్యూలకు స్పాట్‌గా మారింది.  లా అండ్‌ ఆర్డర్‌, డ్రగ్స్‌ వంటి కేసులు కన్నా లవ్‌ షికాయతులే  ఎక్కువగా నార్సింగి పోలీసులకు సవాల్‌ విసురుతున్నాయి. వాటిల్లో మేజర్‌ కేసులు సినిమా వాళ్లకు చెందినవే కావడం గమనార్హం.లేటెస్ట్‌గా హర్షసాయిపై రేప్‌ కేసు ఫైలయింది నార్సింగి పీఎస్‌లోనే.  ఇక  రీసెంట్‌గా సంచలనం రేపిన జానీ మాస్టర్‌ కేసును నార్సింగ్‌ పోలీసులే  డీల్‌ చేస్తున్నారు. ఆ మధ్య  లావణ్య-రాజ్‌ తరుణ్‌ వివాదం సినిమాను తలపించింది. ఇంకా సీరియల్‌లా కొనసాగుతూనే ఉంది.  రాజ్‌ తరుణ్‌కు తనకు పెళ్లయిందని.. లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉన్నామని.. మాల్వీ వల్లే  తమ మధ్య గొడవలొచ్చాయని.. రాజ్‌ తరుణ్‌ తనను మోసం చేశారంటూ నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు లావణ్య.  పరిచయం నిజమే కానీ తమకు పెళ్లి కాలేదని..అసలు మ్యారేజ్‌పై తనకు ఇంట్రెస్ట్‌ లేదన్నారు రాజ్‌ తరుణ్‌. అలా వాదోపవాదాలు సంచలనం రేపాయి. రీసెంట్‌గా మరోసారి  కంప్లేంట్‌ ఇచ్చారు లావణ్య. తన బంగారం, పుస్తెల తాడు, తాళి బొట్టు, డాక్యుమెంట్లు చోరీ చేశారని ఆరోపిస్తూ రాజ్‌ తరుణ్‌, మాల్వీపై నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది లావణ్యరాజ్‌తరుణ్‌ – లావణ్య కేసులో పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. రాజ్‌తరుణ్‌ తనను ప్రేమించి, మోసం చేశారని లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని పోలీసులు నిర్ధారించారు. వాళ్లిద్దరూ పదేళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దర్యాప్తులో భాగంగా లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు, పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు చార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు. అయితే ఈ కేసులో  ముందుస్తు బెయిల్‌ తెచ్చుకున్నాడు రాజ్‌ తరుణ్‌.జానీ మాస్టర్‌ తనను లైంగికంగా వేధించాడని.. తన మాట వినకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని బెదరించాడంటూ  అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌  40 పేజీల్లో తన ఆవేదనను..జానీమాస్టర్‌తో పరిచయం..ఔట్‌ డోర్‌ షూటింగ్‌లో లైంగిక దాడి.. వంటి అంశాలు సహా  జానీ మాస్టర్‌ భార్య కూడా తనపై దాడి చేసిందని కంప్లైంట్‌ ఇచ్చారామె. ముందుగా రాయదుర్గం పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనప్పటికీ.. బాధితురాలు  ఫిర్యాదు ప్రకారం ఆమెపై దాడి జరిగిన ప్రాంతం నార్సింగి పీఎస్‌ పరిధిలో ఉండడంతో కేసును అక్కడకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. గోవాలో జానీ మాస్టర్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టడం.. 14 రోజుల రిమాండ్‌ పడడం తెలిసిందే. పోక్సో సహా పలు సెక్షన్ల కింద జానీ మాస్టర్‌పై కేసు ఫైల్‌ చేశారు నార్సింగిపోలీసులు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు  ఆయన్ని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.ఇక బిగ్‌బాష్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ కేసు  అప్పట్లో సంచలనం రేపింది. తాజా జానీ మాస్టర్‌, హర్షసాయి కేసుల తరహాలోనే షణ్ముఖ జస్వంత్‌ కంటెంట్‌ కూడా సేమ్‌ టు షేమే. ఆ కేసును డీల్‌ చేసింది కూడా నార్సింగి పోలీసులే. షాట్‌ఫిల్మ్‌లో ఛాన్స్‌ పేరిట షణ్ముక్‌, అతని సోదరుడు సంపత్‌ వినయ్‌ తనను మోసం చేశారని బాధితురాలు నార్సింగి పోలీసులను ఆశ్రయించారు.  సంపత్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరొకర్ని మ్యారేజ్‌ చేసుకున్నాడని కంప్లేంట్‌ ఇచ్చారామె. అంతేకాదు పర్సనల్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పెడుతామని బ్లాక్‌ మెయిల్‌ చేశారన్నారు. కేసును టేకప్‌ చేసిన పోలీసులు విచారణ బాగంగా నానక్‌రామ్‌ గూడాలోని షణ్ముఖ్‌ ఇంటికి వెళ్లి చేస్తే గంజాయి గుట్టు బయటపడింది.ఇక మరో ప్రముఖ యూట్యూబర్ చందు సాయి కేసును కూడా నార్సింగి పోలీసులే డీల్ చేశారు. నార్సింగికి చెందిన యువతిని చందు సాయి ప్రేమ పేరుతో మోసం చేశాడనేది అభియోగం. అతనిపై అత్యాచారం, మోసం కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకు వెళ్లిన చందు సాయి బెయిల్‌పై బయటకు వచ్చాడు.ఇక ఇప్పుడు యూ ట్యూబర్ హర్ష సాయి పై అత్యాచారం కేసు ఫైలయింది కూడా నార్సింగ్‌ పీఎస్‌లోనే. పాన్‌ ఇండియా మూవీ సంగతి  ఏమో కానీ   రేప్‌, 2 కోట్ల దగా, బ్లాక్‌ మెయిలింగ్‌ ఆరోపణలతో హర్షసాయి  డర్టీ పిక్చర్‌  నార్సింగి  పీఎస్‌ రికార్డులకెక్కింది.  అదేం చిత్రమోకానీ  లా అండ్‌ ఆర్డర్‌ కేసులకన్నా ఇట్టాంటి కేసులకు నార్సింగ్‌ పీఎస్‌ కేరాఫ్‌గా మారిందనే టాక్‌ పీక్స్‌కు వెళ్లింది.

Related Posts