YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైడ్రా బాధితులకు అండగా గులాబీ దళం

హైడ్రా బాధితులకు అండగా గులాబీ దళం

హైదరాబాద్, సెప్టెంబర్ 26,
హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బలిసినోడికి ఒక న్యాయం, పేదోళ్లకు మరొక న్యాయం అంటే ఊరుకునేది లేదన్నారు. దమ్ముంటే పర్మిషన్లు ఇచ్చినోళ్లు, బిల్డర్లపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు.ఆక్రమణలు, తప్పుడు పర్మిషన్లు ఇచ్చిందే కాంగ్రెసోళ్లు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “మీ మంత్రులు, మీ అన్న ఇళ్లు కూల్చేసి సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీ నిరూపించుకోవాలి. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ న్యాయ పరంగా అండగా ఉంటుంది. బాధితులు తెలంగాణ భవన్ కు రావొచ్చు. మీ ఇబ్బందులు చెప్పొచ్చు. పార్టీ తరపున ఉన్న లీగల్ టీమ్ మీకోసం పోరాడుతుంది. హైడ్రా బాధితుల విషయంలో ప్రభుత్వానికి మానవీయ కోణం ఉండాలి” అని కేటీఆర్ అన్నారు.హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభించిన ఎస్టీపీలను బుధవారం కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరాన్ని పూర్తి మురుగునీటి రహిత నగరంగా మార్చే ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు. ఇవాళ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ ఎస్టీపీని తమ పార్టీ బృందం సందర్శించిందని తెలిపారు. ఎస్టీపీల సందర్శనల్లో ఇది మొదటి అడుగు మాత్రమే అన్న ఆయన… మిగిలిన ఎస్టీపీలను కూడా సందర్శిస్తామని ప్రకటించారు“వందశాతం మురుగునీటిని శుద్ధి చేసిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని మ ప్రభుత్వ లక్ష్యంగా ఉండే. ఈ శుద్ధి చేసిన పూర్తి స్వచ్ఛమైన నీరు మూసీ నదిలోకి పోతుంది. హైదరాబాద్ నగరంలోని 94 శాతం స్వచ్ఛమైన నీరు మూసికి వెళ్తున్నప్పుడు మూసి నీటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఏముంది..? వంద శాతం మురుగునీటి శుద్ధి జరిగిన తర్వాత మూసి ప్రాజెక్టు కోసం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమున్నది.. ? ఈ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రులు, ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు, రూ. 70,000 కోట్లు, రూ. 1,50,000 కోట్లు అంటూ పూటకు ఒక మాట మాట్లాడుతున్నారు. అందుకే ఈ మూసీ నది ప్రక్షాళనపైన అనేక అవినీతి తాలూకు అనుమానాలు వస్తున్నాయి” అని కేటీఆర్ విమర్శలు చెప్పారు.“హైదరాబాద్ నగరంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టలేం అని ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతున్నారు. అదే నిజమైతే మూసీ నది నుంచి తొలగించే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎట్లా ఇస్తామన్నారు..? మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం భారీగా భూమిని సేకరించి సిద్ధంగా ఉంచితే అది రద్దు అంటూ పూటకో మాట మాట్లాడుతున్నారు. గతంలో మా ప్రభుత్వం చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి” అంటూ ప్రభుత్వానికి హితవు పలికారు.త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఒక కార్యచరణ ప్రకటిస్తామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ పేదల ఇల్లు కూలకొట్టినా.. హైదరాబాద్ నగరంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొన్న హైడ్రా వాళ్ళు ఇల్లు కూలకొట్టినప్పుడు చిన్న పాప వేదశ్రీ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయని గుర్తు చేశారు.

Related Posts