YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

న్యూయార్క్/అమరావతి
ప్రపంచ బ్యాంకు 2030 నీటి వనరుల ప్రోగ్రామ్ మేనేజర్ మరియు సహజ పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్ తో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, పవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ న్యూయార్క్ లో సమావేశమయ్యారు. వరదలు, కరువు నివారణకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలపై ఈ సమావేశంలో చర్చించారు. మైక్ వెబ్‌స్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పని విధానాన్ని, పకృతి వనరులను కాపాడటంలో ఆయన కున్న చిత్తశుద్ధిని కొనియాడారు. గతంలో చిత్తూరు జిల్లాలో తమ బృందం పనిచేసిన అనుభవాన్ని, అప్పట్లో తమకు అందిన ప్రోత్సాహన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో తమకు అవకాశం అవకాశం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వరదలు, కరువు నివారణ కోసం తప్పకుండా కలిసి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరదలు, కరువు నివారణ చర్యలపై చేపట్టే ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని మైక్ వెబ్‌స్టర్ హామీ ఇచ్చారు. మైక్ వెబ్‌స్టర్ హామీ ఇవ్వడం పట్ల రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు.
షెల్ ఫౌండేషన్ సీఈఓ జోనాథన్ బెర్మాన్ మరియు పోర్ట్‌ఫోలియో అధిపతి మీరా షాతో సమావేశమైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సన్న, చిన్నకారు రైతులు, గ్రామీణ పేదరిక నిర్మూలన (SERP) కార్యకలాపాల గురించి చర్చించారు. వ్యవసాయం రంగంలో సౌరశక్తి వినియోగాన్ని పెంచడం కోసం, నూతన  ఆవిష్కరణలను రావల్సిన అవసరాన్ని మంత్రి శ్రీనివాస్ జోనాథన్ బెర్మాన్, మీరా షాతో చర్చించారు. సౌరశక్తి రంగంలో నూతన ఆవిష్కరణలు తీసుకురావడంలో వారు ఎలా సహకరించాలి అనే విషయంపై మంత్రి చర్చించారు.

Related Posts